ఒక్క చేప ధర 72 లక్షలు.. ఆ మత్స్యకారుడిని లక్షాధికారిని చేసింది.. దాని ప్రత్యేకత ఏమిటి…?
మనిషి జీవితం ఒక్కసారిగా మారిపోవాలన్నా.. కుప్పలు కుప్పలు డబ్బు వచ్చిపడాలన్నా.. ఏది పట్టుకుంటే అది బంగారం కావాలన్నా టైమ్ రావాలి. ప్రతి మనిషికి కూడా ఒక రోజు వస్తుందట. అవును.. ఆ రోజు కోసం వెయిట్ చేయడం తప్పితే మనం చేసేదేం ఉండదు. ఆ రోజున ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది. దాన్నే లక్కు తోక తొక్కడం అంటారు. అదృష్టం వరించడం అని కూడా అంటారు. అలాంటి అదృష్టం ఓ మత్స్యకారుడిని వరించింది. మామూలుగా కాదు. ఆ రోజు అతడిది. అందుకే.. మనోడు ఆరోజు లక్కు తోకను తొక్కినట్టున్నాడు. దెబ్బకు లక్షాధికారి అయిపోయాడు. ఏకంగా 72 లక్షలు సంపాదించాడు. తన జీవితం మొత్తం కష్టపడినా కూడా అంత డబ్బు సంపాదించలేడు. కానీ.. ఒకే ఒక దెబ్బకు తన వలలో ఒక చేప చిక్కింది. అది లక్షలు తీసుకొచ్చింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. పాకిస్థాన్ లోని బలుచిస్తాన్ కు చెందిన ఓ మత్స్యకారుడి గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఆయన పేరు అబూబాకర్. ఆయన రోజూ చేపల వేటకు వెళ్లి.. వలలో పడిన చేపలను అమ్మి జీవనం సాగిస్తుంటాడు. రోజూ లాగే.. ఆ రోజు కూడా చేపల వేటకు వెళ్లాడు. ఆరోజు వలల్లో ఎక్కువ చేపలు పడలేదు కానీ.. ఒకే ఒక్క చేప పడింది. దాని పేరే క్రోకర జాతికి చెందిన అరుదైన చేప. దాని బరువు ఎంతో తెలుసా? 48 కిలోలు. ఆ చేపకు ఐరోపా దేశాల్లో, చైనాలో మాంచి గిరాకి ఉంటుంది. ఫుల్లు డిమాండ్ ఉంటుంది.
ఎందుకు ఆ చేపకు అంత డిమాండ్ అంటే?
క్రోకర్ జాతికి చెందిన చేపల్లో నిలువెల్లా ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఆ చేపల చర్మాన్ని, ఎముకలను, మాంసాన్ని కూడా ఆయుర్వేద మందుల్లో, ఔషధాల తయారీలో వాడుతారు. వైద్య చికిత్సలోనూ ఈ చేపను వాడుతారట. అందుకే.. ఈ చేపకు అంత డిమాండ్. మొత్తం మీద ఆ చేపను వేలం వేయగా.. చివరకు 72 లక్షలకు అమ్ముడుపోయింది. దీంతో ఆ మత్స్యకారుడు ఒక్కసారిగా లక్షాధికారి అయిపోయాడు. ఇలాంటి చేపలు చాలా అరుదుగా మత్స్యకారుల వలలో పడుతుంటాయి. ఈ చేపలు పడగానే.. వెంటనే వాటిని వేలం వేస్తారు. కాకపోతే ఆ చేప పడాలంటే లక్కు టన్నుల కొద్దీ ఉండాలి.