PAN Card : పాన్‌కార్డ్ హోల్డర్లకు హెచ్చరిక.. మార్చి 31లోపు ఆ పని పూర్తి చేయడం తప్పనిసరి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

PAN Card : పాన్‌కార్డ్ హోల్డర్లకు హెచ్చరిక.. మార్చి 31లోపు ఆ పని పూర్తి చేయడం తప్పనిసరి..!

PAN card : కేంద్ర ప్రభుత్వం.. పాన్‌కార్డ్ కు సంబంధించి మరో హెచ్చరిక జారీ చేసింది. పాన్ కార్డ్ నంబర్‌‌ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోమంటూ ఇప్పటికే పలు మార్లు హెచ్చరికలు జారీ చేయగా ఈ మేరకు మరోసారి అలెర్ట్ ప్రకటించింది. పాన్‌ కార్డ్‌ హోల్డర్లు మార్చి 31 వరకు ఆధార్‌ కార్డ్‌ నంబర్‌తో తప్పక లింక్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది.పాన్‌కార్డ్ హోల్డర్లకు హెచ్చరిక.. మార్చి 31లోపు ఆ పని పూర్తి చేయడం తప్పనిసరి..! ఆర్థిక […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 January 2022,8:25 pm

PAN card : కేంద్ర ప్రభుత్వం.. పాన్‌కార్డ్ కు సంబంధించి మరో హెచ్చరిక జారీ చేసింది. పాన్ కార్డ్ నంబర్‌‌ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోమంటూ ఇప్పటికే పలు మార్లు హెచ్చరికలు జారీ చేయగా ఈ మేరకు మరోసారి అలెర్ట్ ప్రకటించింది. పాన్‌ కార్డ్‌ హోల్డర్లు మార్చి 31 వరకు ఆధార్‌ కార్డ్‌ నంబర్‌తో తప్పక లింక్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది.పాన్‌కార్డ్ హోల్డర్లకు హెచ్చరిక.. మార్చి 31లోపు ఆ పని పూర్తి చేయడం తప్పనిసరి..!

ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈ మేరకు పలు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన గడువులోగా లింక్‌ చేయడంలో విఫలమైతే ఆయా పాన్‌ కార్డ్‌ హోల్డర్ల పాన్‌ కార్డ్ చెల్లుబాటు కాదని పేర్కొంది. దాంతో పాటుగా రూ. 1,000 ని జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ తేదీని సవరించారు. ఏదైనా లావాదేవీలను చేసే సమయంలో ఆధార్‌తో లింక్‌ కానీ పాన్‌ కార్డ్‌ను జత చేస్తే…

PAN card holders are required to link to Aadhaar card number by March 31

PAN card holders are required to link to Aadhaar card number by March 31

ఆదాయపు పన్ను చట్టం-1961 లోని సెక్షన్ 272 ఎన్‌ ప్రకారం సదరు వ్యక్తిపై 10 వేల జరిమానాను అసెస్సింగ్‌ అధికారి విధిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లు, బ్యాంక్ ఖాతా తెరవడం మొదలైన వాటిలో తప్పనిసరిగా పాన్ కార్డ్‌ను కచ్చితంగా సమర్పించడం తప్పనిసరి అయింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది