Swachha Ratham : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. స్వచ్ఛ రథాలు వచ్చేసాయోచ్.. అసలు వీటివల్ల ఉపయోగాలు ఏంటి..?
Swachha Ratham : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ పరిశుభ్రతను పెంపొందించేందుకు కొత్త ప్రయోగంగా ‘స్వచ్ఛ రథం’ అనే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల మౌలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్‌కు మంచి స్పందన లభిస్తోంది. గుంటూరు జిల్లాలోని లాల్‌పురం గ్రామంలో ఈ రథాన్ని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు జూలై 10న ప్రారంభించారు. గ్రామాల్లో చెత్తను సేకరించి, వాటిని రీసైకిల్ చేయడం ద్వారా పరిశుభ్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది.
ఈ స్వచ్ఛ రథంలో తడి చెత్త (ఆర్గానిక్), పొడి చెత్త (రీసైక్లబుల్) వేరు వేరుగా సేకరిస్తారు. తడి చెత్తను ప్రతి రోజూ, పొడి చెత్తను వారంలో రెండు సార్లు సేకరించడానికి వాహనాలు వస్తాయి. గ్రామస్తులు తమ ఇంట్లో ఉండే చెత్తను వేరు చేసి ఈ వాహనాలకు అందిస్తారు. అందుకు బదులుగా కిరాణా సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది. చెత్తకు కూడా విలువ కల్పిస్తూ, ఉపయోగపడే పదార్థాలపై ధరను నిర్ణయించి ప్రజలకు నష్టంలేకుండా మేలుచేస్తున్నారు. చెత్తతో వ్యాపారం అనే కాన్సెప్ట్ గ్రామస్తులకు నచ్చుతోందన్న మాట.

Swachha Ratham : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. స్వచ్ఛ రథాలు వచ్చేసాయోచ్.. అసలు వీటివల్ల ఉపయోగాలు ఏంటి..?
సేకరించిన తడి చెత్తను కంపోస్టింగ్ చేసి జైవ ఎరువుగా, పొడి చెత్తను రీసైక్లింగ్ కంపెనీలకు పంపించి పునఃప్రాసెసింగ్ చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి హాని లేకుండా, చెత్తను సంపదగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఇది స్వచ్ఛ భారత్ మిషన్ భాగంగా పనిచేస్తోంది. గ్రామీణ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరుగుతుంది. ఒకప్పటి వైసీపీ హయాంలో ఉన్న ఖాళీ రేషన్ బండ్లను ఈ స్వచ్ఛ రథాలుగా మార్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ అభివృద్ధికి దోహదపడుతుండగా, సీఎం చంద్రబాబు అభిప్రాయాలను ప్రతిబింబిస్తోంది.