Categories: ExclusiveNewssports

Ramita Jindal : 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో చ‌రిత్ర సృష్టించిన ర‌మిత‌..ఫైన‌ల్‌లో అడుగు

Advertisement
Advertisement

Ramita Jindal :  paris olympics 2024పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా భారత షూటర్లు వేటకొనసాగిస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. శనివారం 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో నిరాశపర్చిన ర‌మిత జిందాల్‌.. ఇవాళ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ సింగిల్‌ ఈవెంట్‌లో సత్తా చాటింది. క్వాలిఫైయర్స్‌లో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 631.5 స్కోరుతో ఐదో స్థానంలో నిలిచి అర్హత సాధించింది. 104.3, 106.0, 104.9, 105.3, 105.3, 105.7 చొప్పున స్కోర్లు సాధించింది. 2022లో హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో రమితా జిందాల్ అదరగొట్టింది. రెండు పతకాలు సాధించిన ఆమె ప్రస్తుత ఒలింపిక్స్‌లో పతకంపై ఆశలు రేపింది.

Advertisement

Ramita Jindal ఫైనల్లో అడుగుపెట్టిన భారత షూటర్‌..

మరో భారత్‌ షూటర్‌ ఎలావెనిల్‌ వేలారివన్‌ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. క్వాలిఫైయర్‌ రౌండ్‌ ఆసాంతం రమితా జిందాల్‌ కంటే ముందంజలో ఉన్న ఎలావెనిల్‌ ఆఖరి షాట్స్‌లో తడబడి ఫైనల్‌ అవకాశాలను చేజార్చుకుంది. శనివారం అర్జున్‌ బబుతా కలిసి 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో తలపడ్డ రమితా ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌ అవకాశాలను తృటిలో కోల్పోయింది. తొలి 8 స్థానాల్లో నిలిచిన షూటర్లు ఈ రోజు(సోమవారం) జరిగే ఫైనల్‌లో పోటీపడతారు. ఒక ర‌మిత జిందాల్ విష‌యానికి వ‌స్తే.. జనవరి 16, 2004న హర్యానాలోని లాడ్వాలో జన్మించింది. 13 ఏళ్ల వయసులో 8వ తరగతి చదువుతున్నప్పుడే షూటింగ్ ప్రపంచంలో ఆమె ప్రయాణం మొదలైంది.

Advertisement

Ramita Jindal : 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో చ‌రిత్ర సృష్టించిన ర‌మిత‌..ఫైన‌ల్‌లో అడుగు

ఆమె ప్రారంభ శిక్షణ లాడ్వాలోని కరణ్ షూటింగ్ అకాడమీలో జరిగింది, అక్కడ ఆమె రోజుకు కేవలం రెండు గంటల సాధనతో ప్రారంభించింది. ఆమె నిబద్ధత మరియు సంకల్పం గేమ్‌పై మ‌రింత ఫోక‌స్ పెంచింది.2022లో బాకులో జరిగిన ప్రపంచ కప్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని సాధించింది. అదీ కాక‌, చాంగ్వాన్‌లో జరిగిన 2022 ప్రపంచ కప్‌లో టీమ్ ఈవెంట్‌లో ఆమె రజత పతకాన్ని అందుకుంది

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

42 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.