Ramita Jindal : 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో చరిత్ర సృష్టించిన రమిత..ఫైనల్‌లో అడుగు
ప్రధానాంశాలు:
Ramita Jindal : 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో చరిత్ర సృష్టించిన రమిత..ఫైనల్‌లో అడుగు
Ramita Jindal : paris olympics 2024పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా భారత షూటర్లు వేటకొనసాగిస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. శనివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో నిరాశపర్చిన రమిత జిందాల్.. ఇవాళ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్ ఈవెంట్‌లో సత్తా చాటింది. క్వాలిఫైయర్స్‌లో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 631.5 స్కోరుతో ఐదో స్థానంలో నిలిచి అర్హత సాధించింది. 104.3, 106.0, 104.9, 105.3, 105.3, 105.7 చొప్పున స్కోర్లు సాధించింది. 2022లో హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో రమితా జిందాల్ అదరగొట్టింది. రెండు పతకాలు సాధించిన ఆమె ప్రస్తుత ఒలింపిక్స్‌లో పతకంపై ఆశలు రేపింది.
Ramita Jindal ఫైనల్లో అడుగుపెట్టిన భారత షూటర్..
మరో భారత్ షూటర్ ఎలావెనిల్ వేలారివన్ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. క్వాలిఫైయర్ రౌండ్ ఆసాంతం రమితా జిందాల్ కంటే ముందంజలో ఉన్న ఎలావెనిల్ ఆఖరి షాట్స్‌లో తడబడి ఫైనల్ అవకాశాలను చేజార్చుకుంది. శనివారం అర్జున్ బబుతా కలిసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో తలపడ్డ రమితా ఆరో స్థానంలో నిలిచి ఫైనల్ అవకాశాలను తృటిలో కోల్పోయింది. తొలి 8 స్థానాల్లో నిలిచిన షూటర్లు ఈ రోజు(సోమవారం) జరిగే ఫైనల్‌లో పోటీపడతారు. ఒక రమిత జిందాల్ విషయానికి వస్తే.. జనవరి 16, 2004న హర్యానాలోని లాడ్వాలో జన్మించింది. 13 ఏళ్ల వయసులో 8వ తరగతి చదువుతున్నప్పుడే షూటింగ్ ప్రపంచంలో ఆమె ప్రయాణం మొదలైంది.
ఆమె ప్రారంభ శిక్షణ లాడ్వాలోని కరణ్ షూటింగ్ అకాడమీలో జరిగింది, అక్కడ ఆమె రోజుకు కేవలం రెండు గంటల సాధనతో ప్రారంభించింది. ఆమె నిబద్ధత మరియు సంకల్పం గేమ్‌పై మరింత ఫోకస్ పెంచింది.2022లో బాకులో జరిగిన ప్రపంచ కప్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని సాధించింది. అదీ కాక, చాంగ్వాన్‌లో జరిగిన 2022 ప్రపంచ కప్‌లో టీమ్ ఈవెంట్‌లో ఆమె రజత పతకాన్ని అందుకుంది