Huzurabad bypoll : హుజూరాబాద్ ఓటర్లకు పండగే పండగ.. ఒక్క ఓటుకు రూ.6 వేలు.. ఇదిగో వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Huzurabad bypoll : హుజూరాబాద్ ఓటర్లకు పండగే పండగ.. ఒక్క ఓటుకు రూ.6 వేలు.. ఇదిగో వీడియో

Huzurabad bypoll : హుజూరాబాద్ ఉపఎన్నిక ఎవరికి లాభం చేస్తుందో చేయదో కానీ.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఓటర్లకు మాత్రం పండుగ రోజులను తీసుకొచ్చింది. వాళ్లకు పెద్ద జాక్ పాట్ తగిలినట్టయింది. హుజూరాబాద్ ఉపఎన్నిక పుణ్యమాని.. ఇప్పుడు హుజూరాబాద్ ఓటర్లు.. అన్ని పార్టీలకు దేవుళ్లు అయ్యారు. ఇవాళ్టి వరకు ఉపఎన్నిక కోసం ప్రచారం జరిగింది. దీంతో ఓటరు దేవుడిని తమ మాటలతో, హామీలతో ప్రసన్నం చేసుకున్నారు అన్ని పార్టీల నేతలు.ఇక.. ఎన్నికల ప్రచారం ముగియడంతో మరో ప్రలోభానికి తెర […]

 Authored By gatla | The Telugu News | Updated on :28 October 2021,7:15 am

Huzurabad bypoll : హుజూరాబాద్ ఉపఎన్నిక ఎవరికి లాభం చేస్తుందో చేయదో కానీ.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఓటర్లకు మాత్రం పండుగ రోజులను తీసుకొచ్చింది. వాళ్లకు పెద్ద జాక్ పాట్ తగిలినట్టయింది. హుజూరాబాద్ ఉపఎన్నిక పుణ్యమాని.. ఇప్పుడు హుజూరాబాద్ ఓటర్లు.. అన్ని పార్టీలకు దేవుళ్లు అయ్యారు. ఇవాళ్టి వరకు ఉపఎన్నిక కోసం ప్రచారం జరిగింది. దీంతో ఓటరు దేవుడిని తమ మాటలతో, హామీలతో ప్రసన్నం చేసుకున్నారు అన్ని పార్టీల నేతలు.ఇక.. ఎన్నికల ప్రచారం ముగియడంతో మరో ప్రలోభానికి తెర లేపారు. ఎన్నికలకు ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో ఉదయం నుంచే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం ప్రారంభించాయి అన్ని పార్టీలు. నిజానికి.. హుజూరాబాద్ లో పోటీ చేస్తున్న అన్ని పార్టీలకు ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయని తెలిసినప్పటికీ..

parties distributing money in huzurabad by elections

parties distributing money in huzurabad by elections

అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక్కో ఓటరుకు 6 వేల రూపాయలు ఇస్తున్నట్టుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.టీఆర్ఎస్ పార్టీ ఒక్కో ఓటుకు 6 వేలు పంచుతున్నట్టుగా కొన్ని వీడియోల్లో చూపిస్తున్నారు. అది నిజమా? కాదా? అనేది తెలియనప్పటికీ.. హుజూరాబాద్ లో డబ్బులు మాత్రం కుప్పలు కుప్పలుగా పంచుతున్నట్టు తెలుస్తోంది. అన్ని పార్టీలు వేలకు వేలు ఓటర్లకు ఇచ్చి తమ పార్టీకే ఓటేయాలంటూ కోరుతున్నాయని తెలుస్తోంది.

Huzurabad bypoll : కవర్ లో పెట్టి కోడ్ వేసి మరీ ఓటర్లకు డబ్బులు

నిన్నటి వరకు మద్యం పంపిణీ చేసి.. తాజాగా ఒక్క ఓటుకు కవర్ లో కోడ్ నెంబర్ వేసి.. ఆరు వేల రూపాయల నగదును పెట్టి పంచుతున్నారు.ఇదిగో ఆరువేలు.. కారు గుర్తు. గెల్లు శ్రీనివాస్ యాదవ్.. అంటూ ఓ వ్యక్తి హిందీలో మాట్లాడుతూ హుజూరాబాద్ ఓటర్ కు డబ్బులు ఇస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రచారం తారా స్థాయికి చేరుకోవడంతో టీఆర్ఎస్ మరో ఎత్తుగడ. ఎన్వలప్ కవర్ లో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ పార్టీ.. ఇదిగో సాక్ష్యం అంటూ సాయికిరణ్ 935 అనే యూజర్ ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

https://twitter.com/DubbakaMuncipal/status/1453235806861209605?s=20

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది