BRS : బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారనుందా..?? పార్టీ హై కమాండ్ నిర్ణయం ఏంటి ..??

Authored By Anusha V | The Telugu News | Published on: January 11, 2024, 7:00 pm

BRS  : తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటమి ప్రభావంతో బీఆర్ఎస్ పార్టీ పేరు మరోసారి చర్చనీయాంశమైంది. కేసీఆర్ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చినప్పటి నుంచి దీనిపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇతర పార్టీ నాయకులు సైతం టీఆర్ఎస్ కు తెలంగాణతో బంధం తెగిపోయిందని చాలా వేదికల్లో బలంగా వారిస్తున్నారు. అయితే తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పేరు మార్పుకు సంబంధించి సొంత పార్టీ నేతలే నాయకులకు సూచనలు చేయడం చర్చనీయాంశమైంది.దీంతో భారత రాష్ట్ర సమితిని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని పార్టీ శ్రేణులు హై కమాండ్ ను కోరుతున్నారు. లోక్ సభ ఎన్నికలు రాబోతుండగా సన్నాహాక సమావేశాల్లో జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి విశ్లేషణను కొనసాగిస్తూనే మరోవైపు ఎక్కువ మంది పార్టీ నాయకులు బీఆర్ఎస్ ను తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా వరంగల్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో సీనియర్ నాయకులు కడియం శ్రీహరి దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ పార్టీగా ప్రజల్లో మనకు బలమైన గుర్తింపు ఉందని, పార్టీ పేరులో తెలంగాణను తొలగించి భారత్ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ పై ఎఫెక్ట్ చూపుతుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ తమది కాదని భావన ప్రజల్లో ఏర్పడింది. వీలైనంత త్వరగా దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది అని కడియం శ్రీహరి తన మనసులోని మాటలు బయటపెట్టినట్లు సమాచారం. అందుకే కనీసం 20 శాతం ప్రజల్లో ఆ భావన ఏర్పడి మన పార్టీకి ఆ మేరకు ఓట్లు దూరమయ్యాయి అని అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. పేరు మారిన తర్వాత అంతగా కలిసి రాలేదని భావన కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది.

నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఎక్కువమంది కార్యకర్తలు, ప్రజలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు పార్టీకి వరమైన తెలంగాణ సెంటిమెంటును దూరం చేసుకోవద్దు. తిరిగి టీఆర్ఎస్ గా మారిస్తే బాగుంటుంది అని మెజారిటీ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం. ఒకవేళ జారీ ఇస్తే రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలనుకుంటే అలాగే ఉంచి రాష్ట్ర రాజకీయాలకు టీఆర్ఎస్ ను తెర మీదకు తీసుకొచ్చే విషయాలు ఆలోచించాలని, ఇందులో న్యాయపరమైన అంశాలు ఏమైనా ఉంటే మాజీ ఎంపీ వినోద్ కుమార్ లాంటి వారు ఈ విషయంలో సంబంధిత నిబంధనలతో చర్చిస్తే బాగుంటుంది అని కేసీఆర్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, కడియం శ్రీహరి వివరించారుష దీనిపై పార్టీ హై కమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Anusha V

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp