BRS : బీఆర్ఎస్ మ‌ళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా.. ముహూర్తం అప్పుడే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BRS : బీఆర్ఎస్ మ‌ళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా.. ముహూర్తం అప్పుడే..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 March 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  BRS : బీఆర్ఎస్ మ‌ళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా.. ముహూర్తం అప్పుడే..!

BRS : బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) మళ్లీ టీఆర్ఎస్‌ (తెలంగాణ రాష్ట్ర సమితి)గా మారుతుందా? అంటే అవును అంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భవించిన ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్‌కు రెండుసార్లు తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెట్టారు. కానీ, బీఆర్‌ఎస్‌గా పేరు మార్చిన తర్వాత తెలంగాణలో అధికారం కోల్పోవడం, రోజురోజుకూ పార్టీ గ్రాఫ్‌ పడిపోతున్న నేపథ్యంలో పేరు మార్పుపై అధిష్ఠానం కసరత్తు చేస్తుంది.

BRS బీఆర్ఎస్ మ‌ళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా ముహూర్తం అప్పుడే

BRS : బీఆర్ఎస్ మ‌ళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా.. ముహూర్తం అప్పుడే..!

BRS టీఆర్ఎస్‌గా..

2014లో అలాగే 2018లో కూడా రెండు సార్లు తెలంగాణాలో అధికారం దక్కించుకుంది టీఆర్ఎస్. అయితే 2018లో రెండోసారి అధికారం దక్కాక కేసీఆర్ ఆలోచనలు జాతీయ రాజకీయాల మీదకు మళ్ళాయి. దాంతో ఆయన టీఆర్ఎస్ ని కాస్తా బీఆర్ఎస్ గా మార్చారు. అంటే భారత రాష్ట్ర సమితి అన్న మాట. టీఆర్ఎస్‌ని 2022 డిసెంబర్ 9న బీఆర్ఎస్ గా మార్చారు. అప్ప‌టి నుండి క‌ష్టాలు ఎక్కువ‌య్యాయి. 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణా శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ఇక 2024 మేలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా బీఅర్ఎస్ కి ఉన్న ఎనిమిది ఎంపీ సీట్లను కూడా పక్కన పెట్టి జీరో నంబర్ ఇచ్చేశారు.

గత పదిహేను నెలలుగా ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ చేయాల్సింది చేస్తున్నా రావాల్సిన మైలేజ్ రావడం లేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వద్దు టీఆర్ఎస్ ముద్దు అన్నది ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన నుంచే మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పాతికేళ్ళ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ ని తిరిగి పార్టీ పేరులోకి తెస్తూ టీఆర్ఎస్ గా మారుస్తార‌నే టాక్ న‌డుస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది