Pattabhi Ram : మాల్దీవుల‌కు వెళ్లిన ప‌ట్టాభి.. ఫొటోలు వైర‌ల్‌..

Authored By mallesh | The Telugu News | Published on: October 26, 2021, 9:50 pm

Pattabhi Ram ఏపీ రాజ‌కీయాలు మొన్న‌టి దాకా ఎంత‌లా అత‌లాకుత‌లం అయిపోయాయో చూశాం. ఏకంగా ప‌ర‌స్ప‌ర దాడుల దాకా వెళ్లాయి. అయితే అక్క‌డితో ఆగ‌కుండా రాష్ట్ర‌ప‌తి పాల‌న అంటూ చంద్ర‌బాబు ఏకంగా ప్రెసిడెంట్‌ను కలిసే వ‌ర‌కు ఏపీ పంచాయితీ వెల్లింది. కాగా అప్ప‌టి దాకా కాస్త సైలెంట్ గా సాగిన రాజ‌కీయాల్లో ఒక్క ప‌దం పెను ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ఆయ‌నెవ‌రో కాదు టీడీపీ నేత ప‌ట్టాభి మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ మీద చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌తో ఏపీ రాజ‌కీయాలు ఇప్ప‌టికీ అట్టుడుకుతూనే ఉన్నాయి.

pattabhi who went to maldives

pattabhi who went to maldives

కాగా ఈ విధ‌మైన అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు పట్టాభిరామ్ పై కేసులు న‌మోదు చేసిన విష‌యం కూడా విదిత‌మే. ఆయ‌న్ను రిమాండ్‌కు కూడా త‌రలించారు. కానీ కోర్టునుంచి బెయిల్ వ‌చ్చిన త‌ర్వాత అస‌లు ప‌ట్టాభి ఎక్క‌డున్నార‌నే వాద‌న మొద‌లైంద‌.ఇ శనివారం సాయంత్రం ప‌ట్టాభిరామ్ బెయిల్ మీద జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఆ త‌ర్వాత నేరుగా హనుమాన్ జంక్షన్ వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డే ఉన్న ఆంజనేయస్వామి విగ్ర‌హానికి పూజ‌లు చేసి వేడుకున్నారు. ఆ త‌ర్వాత విజయవాడకు వెళ్తుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు.

Pattabhi Ram విజ‌య‌వాడ‌కు వెళ్తుండ‌గా పోలీసుల అడ్డ‌గింత‌

tdp

tdp

ఇక ఇంటికి చేరుకోక‌పోవ‌డంతో పోలీసులు మరోసారి ప‌ట్టాభిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అయ్యాయి. కానీ పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌లేద‌ని తెలుస్తోంది. ఆయ‌నే మ‌ళ్లీ అరెస్టు చేస్తార‌నే భ‌యంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌నం పట్టాభి మాల్దీవులకు వెల్తుండ‌గా ఎయిర్ పోర్టు వ‌ద్ద క‌నిపించిన ఫొటోలు ఉన్నాయి. అలాగే ఆయ‌న విమానంలో కూర్చున్న‌ట్టు కొన్ని ఫొటోలు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీంతో ఆయ‌న మాల్దీవ్స్ వెళ్లార‌ని క్లియ‌ర్‌గా స్ప‌ష్టం అవుతోంది. మ‌రి ఆయ‌న ఎందుకు ర‌హ‌స్యంగా వెళ్తున్నార‌నేది క్లియ‌ర్‌గా తెలీదు. అయితే ఆయ‌న ఇలా స‌డెన్ టూర్ వెన‌క ఏదో ఒక బ‌లైమ‌న కార‌ణం ఉండే ఉంటుంద‌ని భావిస్తున్నారు అంతా కూడా. చూడాలి మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp