Pawan Kalyan : పవన్‌ని పక్కకు పెట్టి ఎన్టీఆర్‌ని బీజేపీ పైకి లేపే ప్రయత్నం చేస్తుందా?
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి తెలుగు రాష్ట్రాలలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలలోనే కాదు రాజకీయాలలోను సత్తా చాటుతున్నాడు. పవన్ క్రేజ్‌ని గమనించిన బీజేపీ పవన్‌తో దోస్తి కట్టింది. కొద్ది రోజులుగా కలిసికట్టుగా ఉన్న వీరు ఇటీవల పవన్‌ని కాస్త దూరం పెట్టినట్టు తెలుస్తుంది. ఆ మధ్య చిరంజీవిని పిలిచి ,పవన్‌కి ఆహ్వానం అందించలేదనే ప్రచారం నడిచింది.ఇక తాజాగా కూడా పవన్‌ని అవమానించినట్టు చెప్పుకొస్తున్నారు. తెలంగాణలోని మునుగోడులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి, బిజెపి అగ్ర నేత అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఇక ఈ సభ పూర్తయిన తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో భేటి అయ్యారు అమిత్‌షా.
Pawan Kalyan : బీజేపీ స్కెచెస్..
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనను చూసి ఫిదా అయ్యారని ఆయన అందుకే స్వయంగా పిలిపించుకొని అభినందించాలని ఉద్దేశంతోనే డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే అంశం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ఎందుకంటే జనసేన బీజేపీతో ఆంధ్ర ప్రదేశ్ లో పొత్తు పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన తర్వాత కొన్ని రోజులకే జనసేన బీజేపీ రెండు పొత్తు పెట్టుకున్నాయి.ఈ పొత్తు ఏర్పడిన దాదాపు రెండేళ్ల తర్వాత మాత్రమే అమిత్ షాను కలిసేందుకు పవన్ కళ్యాణ్ కు అపాయింట్మెంట్ దొరికింది.
ఇక మోడీతో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కు మోడీని కలిసే అవకాశం దొరకలేదు. బయటకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా జనసేన బీజేపీ మధ్య పరిస్థితులు అంత బాలేవని రాజకీయ వర్గాల వారు భావిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా డిన్నర్ మీటింగ్ కు పిలవడం చర్చనీయాంశంగా మారింది. పొరపాటున భారతదేశం నుంచి ఆస్కార్ నామినేషన్స్ లో ఎన్టీఆర్ పేరు వెళితే కనుక దాని వెనుక అమిత్ షా హస్తం ఉందని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. చూస్తుంటే రోజురోజుకి బీజేపీ స్కెచెస్ మరింత ఆసక్తికరంగా మారనున్నాయా అనిపిస్తుంది.