Pawan Kalyan : చంద్రబాబు అబద్ధాల రికార్డ్ బద్దలు కొట్టిన పవన్ కళ్యాణ్..!!

Advertisement

Pawan Kalyan : రాజకీయాల్లో అబద్ధాలు కామనే. అబద్దాలు ఆడకపోతే రాజకీయాల్లో రాణించడం కష్టం. అబద్దాలు ఆడకుండా ఇప్పటి వరకు ఏ రాజకీయ నేత కూడా రాజకీయాల్లో రాణించలేదు. ఎన్నికల ముందు అది చేస్తాం.. ఇది చేస్తాం అని గప్పాలు కొడతారు. తీర్చలేని హామీలను కూడా ఇస్తారు. అవన్నీ నమ్మి జనాలు ఓటేస్తారు. గెలిచాక నాయకులు మొహం చాటేస్తారు. అది కామనే కదా. కానీ.. ఈ మధ్య రాజకీయాలు చూస్తే అబద్దాలు కూడా శృతి మించుతున్నాయి. అవును.. మామూలుగా కాదు. అబద్దం ఆడటం తప్పు అని తెలుసు కానీ..

pawan kalyan is more dangerous than chandrababu in that aspect
pawan kalyan is more dangerous than chandrababu in that aspect

ఆ అబద్ధాలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అయితే వాటి డోస్ ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. టీడీపీ అధినేత చంద్రబాబును చూశాం కదా. ఆయన ఏదైనా తన ఖాతాలో వేసుకుంటారు. హైదరాబాద్ ను తానే డెవలప్ చేశా అంటారు. హైటెక్ సిటీ నేనే తెచ్చా అంటారు. కరోనా వ్యాక్సిన్ కూడా నేనే కనిపెట్టా అని చెప్పి జనాలను నమ్మించగలరు. కానీ.. ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబునే పవన్ కళ్యాణ్ మించిపోయారా అనిపిస్తుంది. అవును.. చంద్రబాబును పవన్ కళ్యాణ్ మించిపోయారు. అబద్దాలలో. ఎంతైనా చంద్రబాబు సావాసమే కదా.

Advertisement
pawan kalyan is more dangerous than chandrababu in that aspect
pawan kalyan is more dangerous than chandrababu in that aspect

Pawan Kalyan :  చంద్రబాబునే పవన్ కళ్యాణ్ మించిపోయారా?

అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవ్వరికీ అర్థం కాదు. తనకు కులం లేదంటారు. మళ్లీ కాపుల గురించి మాట్లాడుతారు. కాపులు తనకు ఓటు ఎందుకు వేయలేదు అంటారు. తన దగ్గర రూపాయి లేదంటాడు. తాను చదివింది ఎంఈసీ అంటాడు. ఎంపీసీ అని మరోసారి అంటాడు. ఇంకోసారి రూపాయి కూడా తన దగ్గర లేదని.. వేరే పార్టీల వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకొని నాకు ఓటేయండి అంటారు. ఇలా.. చంద్రబాబును మించి పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు. అందుకే.. చంద్రబాబు లాగానే పవన్ చెప్పే వాటిని కూడా జనాలు నమ్మడం లేదనేది టాక్.

Advertisement
Advertisement