YS Jagan : పెత్తందారులను కొడతా… పేదోడికి పెడతా ఇదే నా స్టైల్ అసెంబ్లీలో జగన్… వీడియో వైరల్..!!
YS Jagan : ఏపీ అసెంబ్లీ సమావేశాలలో రెండో రోజు సీఎం వైఎస్ జగన్ ప్రసంగించిన తీరు ఎంతోమందిని ఆకట్టుకుంది. నోటికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి గాల్లో మాటలు చెప్పుకుంటూ చేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో… అటువంటి పరిస్థితులు ఉండేవని అన్నారు. కానీ తాను నేల మీదే ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు. తాను చేసేది పెత్తందారులతో యుద్ధమని… అది పేదరిక నిర్మూలన కోసమే అని స్పష్టం చేశారు. మేనిఫెస్టో పవిత్ర గ్రంథంలా భావించి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో విశ్వసనీయతను పెంచి… మార్పులు తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. కుల, మత, రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించినట్లు సీఎం జగన్ ప్రసంగం చేశారు. రాష్ట్రంలో జగన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో 98 శాతం హామీలను నెరవేర్చినట్లు పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 600 పౌర సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే అత్యధిక వృద్ధిరేటును సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. ఒకటి పాయింట్ 97 లక్షల కోట్లను డిబిటి ద్వారా లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న సుపరిపాలన కారణంగా… ఇన్ని విజయాలు సాధించినట్లు చెప్పుకొచ్చారు. “నాడు నేడు” ద్వారా శిథిలమైన ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చడం జరిగిందని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రభుత్వ బడిని సీబీఎస్ఈ ఇంగ్లీష్ మీడియంతో దశ దిశ మార్చినట్లు పిల్లలకు అత్యుత్తమైన ట్యాబ్ లు అందించగలిగినట్లు పేర్కొన్నారు. ఇంకా పలు పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీంతో రెండో రోజు అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.