OG | ఓజీ ఒక్క టిక్కెట్ ధ‌ర రూ.5ల‌క్ష‌లా.. ప‌వ‌న్ క్రేజ్ ఇలా ఉంట‌ది మ‌రి..!

Authored By Sam C | The Telugu News | Updated on : 2 September 2025, 1:00 pm

OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ కాగా, నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడు 1 మిలియన్ డాలర్స్ టార్గెట్ పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే OG నైజాం ఫస్ట్ టికెట్ ని వేలం పాట వేయడంతో భారీ ధరకు అమ్ముడయింది.

#image_title

ప‌వ‌న్ క్రేజ్..

తాజాగా పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో స్పేస్ నిర్వహించగా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా ఫ్యాన్స్ కూడా చాలా మంది పాల్గొన్నారు. ఈ స్పేస్ లో నైజాం ఏరియా OG ఫస్ట్ టికెట్ ని వేలం పాట వేశారు. ఈ టికెట్ ఏకంగా 5 లక్షలకు పాడుకున్నారు. ఈ టికెట్ ని నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీమ్ కొనుక్కుంది. ఆ 5 లక్షలను జనసేన పార్టీ ఫండ్ గా ఇస్తామని ప్రకటించారు. మూడు రోజుల్లో ఆ డబ్బుని పార్టీకి అందచేస్తామని తెలిపారు.

దీంతో OG ఫస్ట్ టికెట్ ఆక్షన్ అని ట్విట్టర్ లో ట్రెండ్ కూడా అవుతుంది. వామ్మో ఒక్క టికెట్ ని 5 లక్షలుపెట్టి కొన్నారా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఓ అప్‌డేట్ పెండింగ్‌లో ఉంది. అదే ట్రైలర్ రిలీజ్. ఈ మూవీ ట్రైలర్‌ని ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ట్రైలర్ ఇంత ఆలస్యంగా రిలీజ్ చేయడంపై ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రిలీజ్ సరిగ్గా ఆరు రోజులు ఉండగా ట్రైలర్ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp