ఏపీ రాజకీయాల్లోనే సంచలనం.. త్వరలో జగన్ తో పవన్ కళ్యాణ్ భేటీ?
ఏపీ రాజకీయాల్లో త్వరలోనే ఏదో పెను సంచలనం జరగబోతోంది. అవును.. ఇప్పటి వరకు కలవని ఇద్దరు బడా రాజకీయ నేతలు కలవబోతున్నారు. వాళ్లు ఎవరో కాదు.. ఒక ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయితే మరొకరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వీళ్లు నిజంగా కలిస్తే అదో చరిత్రే అవుతుంది.
అవును.. ఇప్పటి వరకు వీళ్లిద్దరు డైరెక్ట్ గా కలిసి మాట్లాడుకున్నది లేదు. ఇద్దరూ ఏనాడూ ప్రత్యక్షంగా కలుసుకోలేదు. అంతా పరోక్షంగా విమర్శలు చేసుకోవడమే.
అయితే.. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏపీలో ప్రస్తుతం కాకను రేపుతున్నాయి. కుదిరితే తాను జగన్ ను వ్యక్తిగతంగా కలుస్తాను.. అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ప్రచారంలో ఉన్నాయి.
జగన్ ను కలిసేందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు
అసలు.. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఒక ముఖ్యమంత్రిగా జగన్ చేయాల్సిన పనులు ఏంటి.. అనే విషయాలన్నింటినీ నేను జగన్ ను కలిసే వివరిస్తా. జగన్ ను కలిసేందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.. అంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీగానే చెప్పినట్టు తెలుస్తోంది.
ఎందుకంటే.. ఇదివరకు గత ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఓసారి కలిసి.. ప్రజా సమస్యలపై పవన్ విన్నవించారు. మీడియాలో ఎంత చెప్పినా… ఏం మాట్లాడినా.. ప్రజా సమస్యలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరినా.. అది అంతగా ప్రభావం చూపదని.. డైరెక్ట్ గా ప్రజా సమస్యలను చెబితే.. కొంతలో కొంతైనా సమస్యలను తీర్చడానికి సీఎం ముందుకువస్తారన్న ఆశాభావంతో పవన్ కళ్యాణ్.. జగన్ ను కలిసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారట.