Pawan Kalyan : జనసేనాని మౌనాన్ని వీడే దారేది.. పార్టీని బీజేపీలో కలిపేసి సినిమాల్లో బిజీ అయిపోయారా?
Pawan Kalyan పార్టీ పెట్టి ఏడేళ్లైంది.. చేయాల్సిన రచ్చ అంతా చేసేశారు.. ప్రభుత్వం మీద ఫైరయ్యారు.. ఫైర్ అవ్వాల్సిన సమస్యల్ని గాలికొదిలేశారు.. ఒక్కసారిగా వాయిస్ ఇచ్చి… వకీల్ సాబ్ వచ్చాడు.. అంటూ హడావుడీ చేశారు.. మళ్లీ ఒక్కసారిగా సైలెంటయిపోయారు.. చిన్నదా .. పెద్దదా .. అన్న దాంతో సంబంధం లేకుండా ప్రతి దాని మీద విమర్శలు, వాగ్భాణాలు సంధించిన పవన్ కళ్యాణ్ Pawan Kalyan మౌనముద్ర దాల్చడం .. ఏపీ రాజకీయాల్లో చర్చగా మారింది. జగన్ సర్కార్ ను ట్వీట్లు, స్టేట్మెంట్లతో చీల్చి చెండాడేసిన పవన్ .. ప్రస్తుతం ఫుల్ సైలెంట్ అయ్యారు. కరోనాతో హైదరాబాద్ కే పరిమితమైనా, పత్రికా ప్రకటనలతో సందడి చేసినా, ఇప్పుడు మౌనమునిగా మారడం ఎందుకన్నదే అంతు చిక్కని ప్రశ్నలా మారింది..
సినిమా షూటింగుల్లో బిజీనా..Pawan Kalyan
ప్రస్తుతం పవన్ హరిహరరాయమల్లు అనే పాన్ మూవీలో నటిస్తున్నా.. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు. అయితే జనసేన విషయంలోనే కాక .. బీజేపీ విషయంలోనూ అదే వైఖరిలో పవన్ ఉన్నారు.. వచ్చే ఎన్నికలవరకు ప్రతి పోరాటం కలిసి చేయాలని కష్టపడి మరీ పొత్తు పెట్టుకున్న జనసేనాని.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు.. కనీసం బీజేపీ నేతలు కదుపుతున్నా, సమాధానం ఏమీ రావడం లేదని ఆ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక ఏపీలో ఏమన్నా చేయాలంటే, బీజేపీకి జనసేన మద్ధతు తప్పనిసరి.. ఇప్పుడిలా సౌండ్ లేకుండా ఉంటే, ఎలాగన్నది ఆ నేతల అంతర్మథనం.. ఏపీలో బీజేపీకి నేతలున్నా కేడర్ లేదు.. ఇక కేడర్ తప్ప లీడర్లు లేని .. జనసేన తోడు లేకపోవడంతో బీజేపీ ఒంటరిదైపోయింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మిత్రపక్షంతో కలిసి ఉద్యమిస్తామని బీజేపీ చెబుతున్నా, స్పందించడం లేదు. దీంతో ఇక కటీఫ్ ఖాయమంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
జనసేనాని స్పందించకపోతే ..Pawan Kalyan
అదే జరిగితే, బొత్తిగా నిలకడలేదని విమర్శలు తప్పవు. అందుకే కటీఫ్ అనకుండా, పవన్ సైలెంట్ పాలసీ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వామపక్షాలు, టీడీపీ .. అన్ని పార్టీలతోనూ దోస్తీలు, కటీఫ్ లు అయిపోయాయి. ఇక మిగిలింది కమలదండు.. దీనికి జనాల్లో బలం లేదు.. అలాగని పక్కన పడేద్దామంటే, నోరు గట్టిదాయే.. ఏదేతే అదే అయింది.. కొద్దిరోజులు సైలెంట్ గా ఉంటే, అరిచి అరిచి ఊరుకుంటారు.. మళ్లీ ఎన్నికల వేళకు కొత్త పొత్తులు పెట్టుకోవచ్చని వకీల్ సాబ్ ఆలోచనగా విశ్లేషకులు చెబుతున్నారు. జనంలో బలం .. ఓట్లుగా మారడం లేదు. లీడ్ చేసే నేతలు లేరు.. అయితే పవన్ లేకుంటే నాదెండ్ల తప్ప మరో నేత లేని పరిస్థితి.. కనీసం అభిమానాన్ని ఓట్లుగా మార్చుకునే ప్లాన్ లేదు.. ఇక పొత్తులు పుచ్చిపోతున్నాయి.. ఈ టైంలో సైలెంటే బెటర్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక బీజేపీ పట్టువదలని విక్రమార్కుడిలా .. ఏపీకి కాబోయే సీఎం అంటోంది.. కేంద్ర మంత్రి అంటోంది.. దీంతో పవన్ ఏం చేస్తారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.