Pawan Kalyan : రాజకీయంగా అదే కరెక్ట్ అంటున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan : పరిస్థితులు మనకి తగ్గట్లుగా లేనప్పుడు మనమే వాటికి అనుగుణంగా మారిపోవాలి. అన్ని రంగాలతోపాటు పాలిటిక్సులోనూ ఇది ప్రతిఒక్కరూ పాటించాల్సిన సూత్రం ఇది. కొంత మంది దీనికి వ్యతిరేకంగా మొండిగా వెళ్లి ముందడుగు వేయలేక అక్కడే ఆగిపోతున్నారు. ఈ సంగతిని ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరగానే గుర్తించారు. ఇది ఆయన ఆలోచనల్లో వచ్చిన స్పష్టమైన మార్పునకు సంకేతం. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో చూడబోతున్న సినిమాకి సింగిల్ లైన్ స్క్రిప్ట్ కూడా.
Pawan Kalyan అది ఎవరికీ తట్టలేదు..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ వాతావరణం లేదని తెలిసినా, ఓడిపోతామని ముందే అర్థమైనా కలిసి పోటీ చేస్తే బాగుంటుందేమో, భిన్నమైన ఫలితం వచ్చేదేమో అని అటు టీడీపీ గానీ ఇటు జనసేన గానీ అనుకోలేదు. అందుకే జనసేన పార్టీ అధినేత అయుండి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసినా కనీసం ఒక్క చోట కూడా నెగ్గలేకపోయాడు. పవన్ కళ్యాణ్ గెలవలేదు గానీ ఆయన పార్టీ జనసేన తరఫున ఒక ఎమ్మెల్యే విజయం సాధించటం విశేషం. అయితే అదొక కామెడీ అయిపోవటం గమనార్హం.
Pawan Kalyan కలిసుంటే కలదు.. పవన్ కళ్యాణ్
కలిసుంటే కలదు బలం అనేది పాత మాటే. కానీ గొప్ప మాట. అందరూ అనుసరించాల్సిన బాట. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పదని పవర్ స్టార్ గ్రహించారు. ఈ మేరకు బీజేపీని కూడా ఒప్పించేందుకు సిద్ధపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలంటే, వైఎస్ జగన్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలంటే ఇదొక్కటే మార్గమని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నాడు. లోకల్ బాడీ ఎలక్షన్లతోపాటు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితం సైతం ఇదే పాఠం చెబుతోంది.
Pawan Kalyan తక్కువ.. ఎక్కువ.. పవన్ కళ్యాణ్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల పోటీ చేసి కొన్ని ఓట్లతో సరిపెట్టుకునే కంటే బలం ఉన్న ప్రాంతాల్లోనే బరిలోకి దిగితే ఎక్కువ సీట్లు సాధించొచ్చు అని పవన్ కళ్యాణ్ అవగాహన చేసుకున్నారు. బీజేపీకి కూడా దేశవ్యాప్తంగా ప్రతికూల పవనాలు వీస్తుండటంతో ఆ ఓట్లు వైఎస్సార్సీపీకి పడకుండా ఉండాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటిగా నిలవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఎవరు అనేది ముఖ్యం కాదని, విక్టరీ కొట్టడమే గ్రేట్ అని అంటున్నారు. తద్వారా తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోయినా పర్వాలేదు.. ముందు వైఎస్ జగన్ ని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించేయగలిగితే అంతే చాలు అని వివరిస్తున్నారు.