Pawan Kalyan : జనవాణి నిర్వహించేశారు సరే, ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్.?
అర్జీలు తీసుకుని వాటి గురించి మర్చిపోవడం కాదు, ఆయా అర్జీల్లోని అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడ కేంద్రంగా ‘జనవాణి’ కార్యక్రమాన్ని జనసేన అధినేత చేపట్టారు. మొత్తం ఐదు వారాల పాటు రాష్ట్రంలో ప్రతి ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారట. నిజానికి, పెద్ద సంఖ్యలో అర్జీలు పట్టుకుని ప్రజలు, పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారు. ప్రజలు తమ వెతల్ని జనసేనానికి చెప్పుకున్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు జనసేన నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి క్యూ కట్టిన మాట వాస్తవం.
కానీ, ఆయా అర్జీల్లోని అంశాల్ని పరిష్కరించాల్సింది ఎవరు.? అంతిమంగా ఆ పని చేయాల్సింది ప్రభుత్వమే. ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం ఎంతలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, ఎంత సమర్థవంతంగా పని చేస్తున్నాగానీ.. చిన్నా చితకా సమస్యలుంటాయి.
ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా పలు ఏర్పాట్లను ప్రభుత్వం ఎప్పుడూ చేస్తుంటుంది. స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. గడప గడపకీ అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు వెళుతున్నారు..

Pawan Kalyan Janavani, What Will Happen?
వీటితోపాటుగా వాలంటీర్ వ్యవస్థ కూడా వుంది. సో, ఆయా సమస్యలు పరిష్కారం అవకపోవడం అన్నదే వుండదన్నది అధికార వైసీపీ వాదన. జనసేన అధినేత కేవలం పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆయా సమస్యల్ని బాధితులు, అధికారులకు చెప్పుకోవడానికి అవకాశం వున్నప్పుడు, ఆ అర్జీలను పవన్ కళ్యాణ్ తీసుకుని, మళ్ళీ ప్రభుత్వం దద్గరకే వెళతాననడంలో అర్థమేంటి.? ప్చ్, ఇదైతే ఎవరికీ అర్థం కావడంలేదు. జనసేనానికైనా అర్థమయ్యిందో లేదో.!