Kodali Nani : కొంచెం పక్కకి వెళ్ళండి.. కోడాలి నాని పరువు తీసిన పాయల్ రాజ్‌పుత్..!!
Kodali Nani : మాజీమంత్రి కొడాలి నాని Kodali Nani గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైసీపీ పార్టీలో కీలక నేతగా జగన్ నమ్మిన బంటుగా కొడాలి నానికి మంచి పేరు. గుడివాడ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కానీ రాష్ట్రవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ ఉంది. వైసీపీ ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో నాని స్టైలే వేరు. ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్ విషయంలో చాలా దూకుడుగా ఉంటారు. అటువంటి కొడాలి నానినీ హీరోయిన్ పాయల్ రాజపుత్ పరువు తీసేసింది. పూర్తి విషయంలోకి వెళ్తే గుడివాడలో
శ్రీరస్తు షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ రావటం జరిగింది. ఇక ఇదే షోరూమ్ ఓపెనింగ్ కార్యక్రమానికి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా పాయల్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆమె పక్కనే కొడాలి నాని నిలబడ్డారు. ఆ సమయంలో పాయల్ రాజ్ పుత్.. కొడాలి నానినీ పక్కకు వెళ్ళండి.. అనే తరహాలో షోరూం ఓనర్ యాజమాన్యాన్ని తన పక్కన నించో పెట్టుకుని అతని పొగడటం జరిగింది. ఈ సందర్భంలో కొడాలి నాని కొద్దిగా అసహనానికి గురైనట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఇదే సమయంలో తాను నటిస్తున్న ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడింది. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో ప్రస్తుతం నటిస్తున్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరు ఈ పాండమిక్ సమయంలో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. చాలామంది షోరూం ఓపెనింగ్ కార్యక్రమాలకు పిలుస్తారు. కానీ గుడివాడ శ్రీరస్తు షాపింగ్ ఓనర్ అనిల్ గారు నాకు ఎంతో ప్రత్యేకం. గతంలో కూడా పిలిచారు. శ్రీరస్తు యాజమాన్యం నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను.. అని పాయల్ స్పీచ్ ఇచ్చింది…