Home » Exclusive » Pcc Revanth Reddy Meets Gangavva
Exclusive

Gangavva : పాదయాత్రలో రేవంత్ రెడ్డికి ఇష్టమైన వంటకం చేసి తీసుకొచ్చిన గంగవ్వ.. వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 8, 2023 12:41 pm
Advertisement

Gangavva : తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కీలకంగా మారింది. పాదయాత్ర ప్రారంభమై దాదాపు 20 రోజులకు పైగానే కాగా… ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పోటీపడిన గంగవ్వ రేవంత్ రెడ్డిని పాదయాత్రలో కలిసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కోసం స్వయంగా

Advertisement

PCC Revanth Reddy Meets Gangavva

తన ఇంటి దగ్గర ఉండి చేసిన పచ్చిమిర్చి బజ్జిలను తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి వాటిని తీసుకుని అందరికీ పంచిపెట్టి తనకెంతో ఇష్టమైన బజ్జీలని తెలియజేశారు. అంతేకాదు గంగవ్వని చూస్తుంటే తన తల్లి గుర్తుకొస్తుందని కాసేపు… ఆమెతో కూర్చుని మాట్లాడటం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గంగవ్వతో కూర్చున్న సందర్భాన్ని… ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డి తెలియజేశారు. “గంగవ్వ…

Advertisement

తెలంగాణకు పరిచయం అక్కర్లేని అవ్వ. ప్రపంచానికి తనొక సెలబ్రిటీ. నాకు మాత్రం ప్రేమను పంచిన అమ్మ. నాకోసం ఆప్యాయంగా, నాకు ఇష్టమైన మిర్చి బజ్జీ తీసుకువచ్చి, తను చూపించిన ప్రేమ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది. యాత్రలో జనం కష్టాలు, బాధలు నేరుగా చూస్తున్నా. నా అనుభవాలను నా తల్లితో ఇలాగే ముచ్చటించేవాడిని. తల్లిని గుర్తుచేసిన గంగవ్వను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను” అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి