Pension Alert : పెన్షన్ దారులకు మిగిలింది నాలుగు రోజులే.. ఇలా చేయకపోతే పెన్షన్ కట్!
Pension Alert : పెన్షన్ దారులకు కేంద్రం ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోవాలని తెలిపాయి. ఇంకో నాలుగో రోజుల్లో 2021 ఏడాది ముగుస్తుంది. కొత్త సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ అందిస్తేనే పెన్షన్ వస్తుంది. లేనియెడల వచ్చే ఏడాది నుంచి పెన్షన్ రాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పెన్షన్ కోసం జీవన్ ప్రమాణ్ పత్రం తప్పనిసరి అని పేర్కొంది.ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ పెన్షనర్లకు జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ అనేది చాలా కీలకం.
ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్‌ను అందజేస్తూ ఉండాలి. దీనిని పలు విధాలుగా అందజేయవచ్చు. పెన్షన్ అందించే బ్యాంకు బ్రాంచెస్ లేదా కామన్ సర్వీస్ సెంటర్, పోస్టాఫీసు వంటి మార్గాల్లో జీవన్ ప్రమాణ్ ధృవపత్రాన్ని అందజేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు.డిసెంబర్ 31 వరకు ఈ సర్టిఫికెట్‌ను సమర్పించాలి.దీని గడువు గత నెలతోనే ముగిసినా కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువును నెల రోజులు పెంచింది. ఇప్పటివరకు లైఫ్ సర్టిఫికెట్ అందజేయని వారు వెంటనే సమీపంలోని పెన్షన్ ఆఫీసు, బ్యాంకు బ్రాంచ్, పోస్టాఫీసు లేదా ఆన్‌లైన్ ద్వారా సమర్పించండి.
Pension Alert : పెన్షనర్లకు కీలక డాక్యుమెంట్
పెన్షన్ పొందుతున్న వారు జీవించే ఉన్నారని తెలిపేందుకు ఇది ఉపయోగపడుతుంది. జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్‌లో ఆధార్ ఆధారిత అథెంటికేషన్ ద్వారా కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను పొందవచ్చును.. ఇంకో విషయం ఏంటంటే డోర్ స్టెప్ సర్వీసుల ద్వారా కూడా దీనిని పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 12 బ్యాంకులు ఈ సర్వీసులను అందిస్తోంది. మీరు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌కు వెళ్లి అక్కడ రిజిస్టర్ చేసుకుంటే సమీపంలోని సెంట్రల్ పెన్షన్ ఆఫీస్, పెన్షన్ పొందే బ్యాంక్‌లో మీ లైఫ్ సర్టిఫికెట్‌ను అందించవచ్చు..