Perni Nani : చంద్రబాబు నీ భార్య ఏమైనా పెద్ద ఇదా .. భారతమ్మ ముందు ఎంతరా మీరు అందరూ.. ఫుట్ బాల్ ఆడేసిన పేర్ని నాని ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Perni Nani : చంద్రబాబు నీ భార్య ఏమైనా పెద్ద ఇదా .. భారతమ్మ ముందు ఎంతరా మీరు అందరూ.. ఫుట్ బాల్ ఆడేసిన పేర్ని నాని !

 Authored By sekhar | The Telugu News | Updated on :13 February 2023,8:00 pm

Perni Nani : వైసీపీ బందరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని వైయస్ కుటుంబానికి వీర విధేయుడు అన్న సంగతి తెలిసిందే. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడిన నాటినుండి… ఆయన వెంటే నడుస్తూ వైసీపీలో కీలక నేతగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని లేదా వైయస్ కుటుంబాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేసే వారికి పేర్ని నాని తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ వస్తుంటారు. తాజాగా ఇటీవల ఏపి టీడీపీ అద్యక్షుడు అచ్చెనాయుడు   “జగన్నాసుర రక్త చరిత్ర” పేరిట ఓ పుస్తకం విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకంలో వైయస్ జగన్ తో పాటు వైయస్ కుటుంబానికి చెందిన పలువురినీ టార్గెట్ చేసి.. రకరకాల ఫోటోలు.. రాతలు ఉండటంపై వైసీపీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.”జగనాసుర” అనే ఈ పుస్తకంలో చంద్రబాబు పేరు ఇంక టిడిపి పేరు లేదని ఎందుకు అంత భయం అని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

minister perni nani comments on bheemla nayak movie tickets rates

minister perni nani comments on bheemla nayak movie tickets rates

అసత్యపు విషపు రాతలు రాసి… వైయస్ కుటుంబాని ఎందుకు టార్గెట్ చేశారని విమర్శించారు. వైయస్ వివేక హత్య జరిగిన సమయంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకు విచారించలేదు అని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వంలో ఎందుకు చార్జి షీట్ వేయలేదని అవినాష్ పేరు ఎందుకు చేర్చలేదని మండిపడ్డారు. అటువంటి ఈ పుస్తకంలో వైయస్ భారతమ్మ ఫోటో ఎందుకు వేశావు అని చంద్రబాబునీ  పేర్ని నాని ప్రశ్నించారు. అసలు నిన్ను ఏమని అనాలి. నీ అంత నీచుడు మరొకడు ఉండరు.

perni nani comments on chandrababu

perni nani comments on chandrababu

వైయస్ జగన్ ని ఏమీ చేయలేక… మానసికంగా కృంగ తీయడానికి ఈ రకంగా ఇంట్లో ఆడవాళ్లు ఫోటోలు వేస్తారా అని చంద్రబాబుపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నీ భార్యే ఆవిడ.. మిగతా వాళ్ళ భార్యలు ఆడవాళ్లు కాదా..?. ఎక్కడో సోషల్ మీడియాలో చంద్రబాబు భార్యని విమర్శిస్తే దానిని పట్టుకొని మా ఆవిడని తిట్టారు అని రాజకీయంగా వాడుకున్నావు. రాజకీయం కోసం ఎదుటివారి ఇంట్లో ఆడవాళ్లను సైతం బజారుకు తీసుకొచ్చే పరిస్థితి. ఇది చంద్రబాబు నీచమైన సంస్కృతి అంటూ పేర్ని నాని తనదైన శైలిలో మండిపడ్డారు. చంద్రబాబు భార్య యేనా ఆడవాళ్ళూ.. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి..? భారతమ్మ.. పై విషపు రాతలు రాయటం ఏంటి అంటూ పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించి పుస్తకంలో రాతలపై చెడుగుడు ఆడేసుకున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది