perni nani comments on pawan kalyan and chandrababu
Perni Nani : వైసీపీ బందరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని వైయస్ కుటుంబానికి వీర విధేయుడు అన్న సంగతి తెలిసిందే. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడిన నాటినుండి… ఆయన వెంటే నడుస్తూ వైసీపీలో కీలక నేతగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని లేదా వైయస్ కుటుంబాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేసే వారికి పేర్ని నాని తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ వస్తుంటారు. తాజాగా ఇటీవల ఏపి టీడీపీ అద్యక్షుడు అచ్చెనాయుడు “జగన్నాసుర రక్త చరిత్ర” పేరిట ఓ పుస్తకం విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకంలో వైయస్ జగన్ తో పాటు వైయస్ కుటుంబానికి చెందిన పలువురినీ టార్గెట్ చేసి.. రకరకాల ఫోటోలు.. రాతలు ఉండటంపై వైసీపీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.”జగనాసుర” అనే ఈ పుస్తకంలో చంద్రబాబు పేరు ఇంక టిడిపి పేరు లేదని ఎందుకు అంత భయం అని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
minister perni nani comments on bheemla nayak movie tickets rates
అసత్యపు విషపు రాతలు రాసి… వైయస్ కుటుంబాని ఎందుకు టార్గెట్ చేశారని విమర్శించారు. వైయస్ వివేక హత్య జరిగిన సమయంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకు విచారించలేదు అని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వంలో ఎందుకు చార్జి షీట్ వేయలేదని అవినాష్ పేరు ఎందుకు చేర్చలేదని మండిపడ్డారు. అటువంటి ఈ పుస్తకంలో వైయస్ భారతమ్మ ఫోటో ఎందుకు వేశావు అని చంద్రబాబునీ పేర్ని నాని ప్రశ్నించారు. అసలు నిన్ను ఏమని అనాలి. నీ అంత నీచుడు మరొకడు ఉండరు.
perni nani comments on chandrababu
వైయస్ జగన్ ని ఏమీ చేయలేక… మానసికంగా కృంగ తీయడానికి ఈ రకంగా ఇంట్లో ఆడవాళ్లు ఫోటోలు వేస్తారా అని చంద్రబాబుపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నీ భార్యే ఆవిడ.. మిగతా వాళ్ళ భార్యలు ఆడవాళ్లు కాదా..?. ఎక్కడో సోషల్ మీడియాలో చంద్రబాబు భార్యని విమర్శిస్తే దానిని పట్టుకొని మా ఆవిడని తిట్టారు అని రాజకీయంగా వాడుకున్నావు. రాజకీయం కోసం ఎదుటివారి ఇంట్లో ఆడవాళ్లను సైతం బజారుకు తీసుకొచ్చే పరిస్థితి. ఇది చంద్రబాబు నీచమైన సంస్కృతి అంటూ పేర్ని నాని తనదైన శైలిలో మండిపడ్డారు. చంద్రబాబు భార్య యేనా ఆడవాళ్ళూ.. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి..? భారతమ్మ.. పై విషపు రాతలు రాయటం ఏంటి అంటూ పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించి పుస్తకంలో రాతలపై చెడుగుడు ఆడేసుకున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.