hero nandamuri Taraka Ratna passed away
Taraka Ratna : నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రికి చేరి రెండు వారాలు దాటింది. తారకరత్న ఆస్పత్రికి చేరి వారం రోజులు దాకా తన హెల్త్ గురించి అప్డేట్స్ కనిపిస్తుండేవి. తారకరత్న చికిత్స తీసుకుంటున్న బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ను అఫీషియల్గా విడుదల చేసేవారు. కానీ గత పది రోజులుగా తారకరత్న హెల్త్ గురించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో అభిమానులు తారక రత్న హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని కోరుకుంటున్నారు మొదట్లో నందమూరి ఫ్యామిలీ తారకరత్న విషయంలో ఎంతో హంగామా చేసి ఇప్పుడు అంత సైలెంట్ గా ఉండిపోయారు.
దీంతో తారకరత్నకు ఏమైందని, ఎందుకు అప్డేట్స్ ఇవ్వట్లేదని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు తారకరత్నను చికిత్స కోసం విదేశాలకు పంపించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం విదేశీ వైద్యులనే ఇక్కడికి రప్పించినట్లు సమాచారం. చికిత్సకు అవసరమైన సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్న నేపథ్యంలో విదేశాల్లో పేరుపడ్డ వైద్య నిపుణులనే ఇక్కడికి రప్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నందమూరి కుటుంబ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి.
Taraka Ratna health in critical condition
గుండె, ఇతర అవయవాలు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ మెదడు దెబ్బ తినడం తారకరత్నకు సమస్యగా మారినట్లు తెలుస్తోంది. దాదాపు తారకరత్న కోమస్థితికి దగ్గరగా వెళ్ళినట్టు తెలుస్తుంది. దీంతో బ్రెయిన్ రికవరీ చేసి సాధారణ స్థితికి తీసుకురావాలని వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం విదేశీ వైద్యుల ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేపిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో అభిమానులు తారక రత్న కోలుకొని ఆరోగ్యంతో తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటున్నారు.
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
This website uses cookies.