Categories: ExclusiveNationalNews

PM Modi : దేశ ప్ర‌జ‌ల‌కు కేంద్రం తీపి క‌బురు.. మ‌రో ఆరు నెల‌లు ఆ ప‌థ‌కం పొడ‌గింపు

PM Modi : కరోనా నేపథ్యంలో చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. చాలా మంది ఆర్థికంగా న‌ష్ట‌పోయారు. ఇప్ప‌టికీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేద, బడుగు వర్గాలు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరారు. ఈ నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు ఉచిత రేషన్ పంపిణీ చేశాయి. మొదటి వేవ్ నుంచి రెండో వేవ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగించింది.ఉచిత రేషన్‌ పంపిణీని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది.

కరోనా సంక్షోభం నేపథ్యంలో 2020 మార్చిలో ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద తెల్ల రేషన్‌ కార్డు, అంతోద్యయ అన్న యోజన కార్డు, ఆహార పథకం కార్డు కలిగిన ఒక్కొక్కరికి నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ పథకం మార్చి నెలతో ముగియనుండగా తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మరోసారి కేంద్రం పొడిగించింది. శనివారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

PM modi announced that pradhan mantri garib kalyan anna yojana extended next six months

PM Modi : ఆకలితో ఇబ్బందులు పడకూడదనే..

కరోనా సంక్షోభం కారణంగా ప్రజలెవరూ ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని ప్రవేశపెట్టింది. నిర్ణీత కాల వ్యవధితో ప్రవేశ పెట్టిన ఈ పథకం గడువు ఒకసారి ముగియగా.. పొడిగించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకం గడువును పొడిస్తున్నట్లు స్వ‌యంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశంలోని ప్రజల శక్తిని మరింత బలోపేతం చేసేందుకు పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజనను మరో ఆర్నెళ్ల పాటు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంతకుముందులాగే 80 కోట్ల మందికి పైగా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోగలర‌ని ట్వీట్ ద్వారా ప్ర‌ధాని తెలియ‌జేశారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago