PM Modi : దేశ ప్రజలకు కేంద్రం తీపి కబురు.. మరో ఆరు నెలలు ఆ పథకం పొడగింపు
PM Modi : కరోనా నేపథ్యంలో చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. ఇప్పటికీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేద, బడుగు వర్గాలు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరారు. ఈ నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు ఉచిత రేషన్ పంపిణీ చేశాయి. మొదటి వేవ్ నుంచి రెండో వేవ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగించింది.ఉచిత రేషన్ పంపిణీని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది.
కరోనా సంక్షోభం నేపథ్యంలో 2020 మార్చిలో ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద తెల్ల రేషన్ కార్డు, అంతోద్యయ అన్న యోజన కార్డు, ఆహార పథకం కార్డు కలిగిన ఒక్కొక్కరికి నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ పథకం మార్చి నెలతో ముగియనుండగా తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మరోసారి కేంద్రం పొడిగించింది. శనివారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
PM Modi : ఆకలితో ఇబ్బందులు పడకూడదనే..
కరోనా సంక్షోభం కారణంగా ప్రజలెవరూ ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని ప్రవేశపెట్టింది. నిర్ణీత కాల వ్యవధితో ప్రవేశ పెట్టిన ఈ పథకం గడువు ఒకసారి ముగియగా.. పొడిగించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకం గడువును పొడిస్తున్నట్లు స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశంలోని ప్రజల శక్తిని మరింత బలోపేతం చేసేందుకు పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజనను మరో ఆర్నెళ్ల పాటు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంతకుముందులాగే 80 కోట్ల మందికి పైగా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోగలరని ట్వీట్ ద్వారా ప్రధాని తెలియజేశారు.