Pawan Kalyan : మోడీ పీకిన క్లాస్ తో దెబ్బకి దార్లో పడ్డ పవన్ కల్యాణ్ !
Pawan Kalyan : గత వారం రోజుల నుంచి ఏపీలో ఒకటే చర్చ. ఏపీ రాజకీయాలు ఒకేసారి యూటర్న్ తీసుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్. ఏపీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ కావడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. నిజానికి.. పవన్ పోరాటం కేవలం వైఎస్ జగన్ మీదనే. వైసీపీ మీదనే. వేరే ఎవ్వరి మీద చూపించనంత తన కోపాన్ని కేవలం వైసీపీ మీదనే చూపిస్తారు పవన్ కళ్యాణ్. టీడీపీకి కూడా కావాల్సింది అదే. అందుకే చంద్రబాబు, పవన్ కలిసి కూడా చాలా సార్లు వైసీపీ మీద యుద్ధం ప్రకటించారు. కట్ చేస్తే ప్రధాని మోదీ ఇటీవల పవన్ కళ్యాణ్ తో భేటీ అవడం సర్వత్రా చర్చకు దారి తీసింది.
దానికి కారణం.. ఏపీలో చంద్రబాబుతో కలిసి పవన్ అడుగులు వేస్తున్నట్టు కనిపించడం. కానీ.. ఇదివరకే జనసేన పార్టీ బీజేపీతో పొత్తు కూడటం తెలిసిందే. కానీ.. ఓవైపు చంద్రబాబుతో నడవడం, మరోవైపు ప్రధాని మోదీని కలవడంపై ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. టీడీపీ అధినేత చంద్రబాబు గురించి ప్రధాని మోదీకి తెలిసిందే. అందుకే.. పవన్ తో భేటీ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో సందర్భంలో చంద్రబాబు గురించి చర్చించబోయారట. చంద్రబాబు గురించి పవన్ ఏదో చెప్పబోగా.. ఆ విషయాన్ని మోదీ కట్ చేసి వేరే టాపిక్ మాట్లాడారట. అంతే కాదు..
Pawan Kalyan : ప్రధాని మోదీ అందుకే పవన్ ను కలిశారా?
బీజేపీతో కలిసి పోరాటం చేయాలని పవన్ కు మోదీ చెప్పారట. ఇప్పుడు పొత్తుల గురించి అవసరం లేదని, ఎన్నికలకు ఇంకా సమయం ఉందని మోదీ పవన్ కు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారట. అంటే చంద్రబాబుతో కలిసి పవన్ పయనించడం.. మోదీకి ఇష్టం లేదన్నమాట. అలాగే బీజేపీ పార్టీతో కలిసి ఏం చేయాలో.. ఎలాంటి ఉద్యమాలు చేయాలో పవన్ కు మోదీ హితబోధ చేశారట. అంటే.. పవన్, చంద్రబాబును విడదీయడం కోసమే.. మోదీ.. పవన్ తో భేటీ అయ్యారన్నమాట. అంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుందా? వైసీపీ, టీడీపీని ఓడించడం కోసం బీజేపీ ఇంకా ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో వేచి చూడాల్సిందే.