Polavaram : పోలవరం విషయంలో జగన్ కూడా అదే పద్దతి.. ఇక న్యాయం ఎక్కడుంది?
Polavaram ఏపీ ప్రజలు పోలవరం ప్రాజెక్ట్ కోసం రెండున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఎంతో ప్రయోజనం అంటూ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుండి మొదలుకుని ఇప్పుడు ఉన్న వైఎస్ జగన్ మోహన్ ప్రభుత్వం వరకు ఎన్నో విధాలుగా Polavaram ప్రాజెక్ట్ ను దాటవేస్తూ వస్తున్నారు. కొందరు చేస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చి పనులు జరుగుతున్నట్లుగా ఏదో హడావుడి చేస్తున్నారు. కాని ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లుగానే పరిస్థితి ఉంటుంది. ప్రతి ప్రభుత్వం కూడా అదుగో మేము చేస్తున్నాం.. ఇదిగో ముగింపు దశకు వచ్చిందని చెబుతున్నారు. గత ప్రభుత్వం కమీషన్ ల కోసం ఈ ప్రాజెక్ట్ విలువను భారీగా పెంచేశారు అంటూ జగన్ ప్రభుత్వం ఆరోపించి రివర్స్ టెండరింగ్ ను తీసుకు వచ్చింది.
Polavaram జగన్ చేసింది కూడా అదే..
కొత్త టెండర్లను పిలవడం ద్వారా రూ.750 కోట్ల రూపాయలను ఆదా చేశామంటూ చెప్పుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం పోలవరం ను మళ్లీ అంచనా వ్యయం పెంచకుండా ఈ టెండర్లతోనే పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో పోలవరం Polavaram అంచనా విలువ భారీగా పెరిగిందని.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కమీషన్ ల కోసం ఆ విధంగా అంచనా వ్యయం పెంచారంటూ ఆరోపణలు వినిపించాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు ను ఫాలో అయ్యి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రాజెక్ట్ అంచనా వ్యయంను పెంచేశాడు.
Polavaram రాత్రికి రాత్రే జీవో…
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాత్రికి రాత్రే కొత్త జీవోను తీసుకు వచ్చి ఏకంగా 3200 కోట్ల మేరకు పెంచుతూ అంచనా వ్యయంను ఖరారు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాల వారు ప్రకటించారు. మట్టి ఇసుక ఇలా అన్నింటి వ్యయం పెరగడం వల్ల అంచనా వ్యయం పెంచినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం అంచనా వ్యయం పెంచడం పట్ల ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకుల రంగంలోకి దిగారు. తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు ఇతర పార్టీల నాయకులు కూడా పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఎంత వర్క్ అయ్యిందో చెప్పాలంటూ జగన్ ను జనాలు ప్రశ్నిస్తున్నారు.