వీళ్లు వైకాపాకు నష్టమే తప్ప లాభం లేదంటూ జగన్ కు ఫిర్యాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

వీళ్లు వైకాపాకు నష్టమే తప్ప లాభం లేదంటూ జగన్ కు ఫిర్యాదు

 Authored By himanshi | The Telugu News | Updated on :24 May 2021,4:50 pm

ysrcp party ఏపీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయాన్ని సొంతం చేసుకున్న వైకాపా ను మళ్లీ అధికారంలోకి తీసుకు రావాలని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న అభివృద్ది మరియు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు దక్కించుకుంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ ఆయనే సీఎం అంటూ టాక్ వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఆయన మాత్రమే కాకుండా ఆయన మంత్రి వర్గ సహచరలు మరియు ఇతర పార్టీ నాయకులు కూడా బాగా పని చేస్తేనే లాభం ఉంటుంది. అలా కాదని ఎలాగూ పార్టీ జోరు మీద ఉంది.. మేము ఏం చేయకున్నా కూడా తదుపరి ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తాం అనే ఫలింగ్‌ ఉంటే మాత్రం 2024 ఎన్నికల్లో కష్టం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ysrcp party కింది స్థాయి నాయకులు నిద్రలో..

ysrcp party leaders not doing well

ysrcp party leaders not doing well

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగూతు ఉంటే ఇటీవల గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌ లు మరియు మున్సిపల్‌ ప్రజా ప్రతినిదులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వారు కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటం వల్లే ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వారు కనుక ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్లకుంటే మాత్రం వ్యతిరేకత మొదలయ్యే అవకాశం ఉంది. కింది స్థాయిలో విమర్శలు వ్యతిరేకత మొదలయితే మాత్రం ఇక అంతే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ysrcp party మంత్రి పెద్దిరెడ్డి అసంతృప్తి..

ఇటీవలే మంత్రి పెద్ది రెడ్డి మాట్లాడుతూ.. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడగలేదు కనుక అందుకే వారి కష్టాలు మీకు అర్థం అవ్వడం లేదు. ఎందుకు మీరు ప్రజల్లోకి వెళ్లడం లేదు అంటూ కింది స్థాయి ప్రజా ప్రతినిధులను మంత్రి ప్రశ్నించాడు. సీఎం దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్లింది. అందుకే ప్రజల్లోకి వెళ్లకుండా తమకు పట్టనట్లుగా ఉంటున్న ప్రజా ప్రతినిధులను మాత్రం సస్పెండ్‌ చేసే వరకు వెళ్లవలిసి వస్తుందంటూ హెచ్చరించాడు. ఇప్పటికి అయినా కింది స్థాయి నాయకులు కార్యకర్తలకు మరియు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధనాయకత్వం ఆదేశించింది. మీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటే వచ్చే ఎన్నికల్లో పార్టీకి చాలా నష్టం కలుగుతుందని అంటున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది