police imposes fine on his own son in chittoor
ఏపీలో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోంది. ఏపీలో కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. నిజానికి రాత్రి పూట కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం విధించినా.. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోగా… రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే.. వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కరోనా నియంత్రణ కోసం మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూను విధించింది ఏపీ ప్రభుత్వం. అంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే షాపులను తెరుచుకోవాలి. నిత్యావసర సరుకుల కోసం బయటికి వెళ్లాలి. మధ్యాహ్నం 12 నుంచి తెల్లారి ఉదయం 6 వరకు ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూ ఉంటుంది. దీంతో పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 దాటితే ఎవరైనా బయట కనిపిస్తే వెంటనే వారికి ఫైన్ వేయడమో.. లేక బడితె పూజ చేయడమో చేస్తున్నారు.
police imposes fine on his own son in chittoor
ఏది ఏమైనా ఎవరో ఒకరు చిన్న చిన్న కారణాలతో బయట తిరుగుతూనే ఉన్నారు. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకొని బయట రోడ్ల మీద తిరుగుతున్నారు జనాలు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వస్తోంది. కేవలం ఎమర్జెన్సీ వాహనాలకు, ఇతర వైద్య సేవలకు వెళ్లే వాళ్లు, మీడియాకు, కూరగాయలు, ఇతర ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఉంది. అయినప్పటికీ.. కొందరు కావాలని బయటికి వస్తున్నారు. పోలీసుల చేతుల్లో తన్నులు తింటున్నారు.
తాజాగా.. చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకున్నది. చిత్తూరు జిల్లా పలమనేరులో సీఐ జయరామయ్య నేతృత్వంలో పోలీసులు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో ఎవరు బయట కనిపించినా.. ఫైన్ వేస్తున్నారు. అయితే.. ఓ యువకుడు కూడా బయట కనిపించడంతో.. ఓ కానిస్టేబుల్ ఆ యువకుడిని తీసుకొని.. సీఐ జయరామయ్య దగ్గరికి తీసుకొచ్చాడు.
police imposes fine on his own son in chittoor
తీరా చూస్తే.. ఆయువకుడు ఎవరో కాదు.. సీఐ జయరామయ్య కొడుకు. సారీ సార్.. మీ కొడుకు అని తెలియక తీసుకొచ్చా.. అని కానిస్టేబుల్ ఏదో చెప్పబోగా… చట్టం ముందు అందరూ సమానులే. కర్ఫ్యూ సమయంలో ఎవ్వరూ బయటికి రాకూడదు. ఫైన్ కట్టు అంటూ 125 రూపాయల ఫైన్ కట్టించుకున్నాడు ఆ సీఐ. ఇంకోసారి బయట తిరిగినే కఠిన చర్యలు తీసుకుంటాం.. అంటూ సొంత కొడుకునే హెచ్చరించి మరీ పంపించాడు ఆ సీఐ. సీఐ చేసిన పనికి అక్కడి స్థానికులు తెగ మెచ్చుకుంటున్నారు. పోలీస్ అంటే ఇలా ఉండాలి అంటూ ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
This website uses cookies.