Parents : సొంత తల్లిదండ్రులపై ఖాకీ జులుం.. అధికార మదంలో కన్నవారికే చిత్ర హింసలు..!
ప్రధానాంశాలు:
Parents : సొంత తల్లిదండ్రులపై ఖాకీ జులుం.. అధికార మదంలో కన్నవారికే చిత్ర హింసలు..!
Parents : బాధ్యత గల పోలీసు ఉన్నతాధికారి అయి ఉండి, అన్యాయం జరిగిందని తమ దగ్గరకి వచ్చేవారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి అయి ఉండి ఆస్తుల కోసం కన్నతల్లిదండ్రులను వేధింపులకు గురి చేశాడు ఓ అధికారి. తన పలుకుబడితో వారికి నరకం చూపిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన సదరు పోలీసు అధికారి తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని ఆశ్రయించారు. కొడుకు వేధింపులు తట్టుకోలేకపోతున్నామని.. మీరే మమ్మల్ని రక్షించాలని డీజీపీ జితేందర్‌ను వేడుకున్నారు. కని, పెంచి, ఓ ప్రయోజకుడిని చేసిన తల్లిదండ్రులనే అధికార మదంతో చిత్రహింసలకు గురి చేస్తున్నాడు.
Parents వాడు కొడుకేనా..
అన్నయ్య తప్పుడు వ్యవహారం తెలిసిన తమ్ముడు.. మంచి పద్ధతి కాదని వారించి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించినా.. కఠిన ఖాకీ హృదయం చలించలేదు. విసిగివేసారిన ఆ తల్లిండ్రులు ఏకంగా పోలీస్ బాస్‌ను కలిసి తమ మొర ఏకరువు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం, వెంకటాయింపల్లికి చెందిన రఘునాథ్‌రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు నాగేశ్వర్‌రెడ్డి రాచకొండ కమిషనరేట్‌లో ఓ స్టేషన్ సీఐ, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మల్టీ జోన్ 2లో విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు యాదయ్య కూడా పోలీసు శాఖలోనే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కూతుళ్లు ఇద్దరికి పెళ్లిళ్లు చేశాడు.

Parents : సొంత తల్లిదండ్రులపై ఖాకీ జులుం.. అధికార మదంలో కన్నవారికే చిత్ర హింసలు..!
రఘునాథ్‌రెడ్డికి ఉన్న 30 ఎకరాల 23 గుంటల భూమిలో.. పెద్దకొడుకు పేరున 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరున 11 ఎకరాలు పట్టాచేశాడు. మిగిలిన భూమిని కూతుళ్లకు ఇచ్చేందుకు తమ పేరున ఉంచుకున్నారు. ఈ భూమిపై పెద్దకొడుకు, సీఐ నాగేశ్వర్‌రెడ్డి కన్ను పడింది. తన పేరున ఇంకో 5 ఎకరాలు పట్టా చేయాలని వృద్ధులైన తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాడు. ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ పలుమార్లు దాడి చేశాడు. పెద్ద కొడుకు వేధింపులు తాళలేక చిన్న కొడుకు యాదయ్య ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. ఈ విషయాలన్నీ డీజీపీ జితేందర్‌కు ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ మొరపెట్టుకున్నారు. తన కొడుకు నాగేశ్వర్‌రెడ్డిపై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.