Ponguleti srinivas reddy | ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గ్రీన్ సిగ్నల్ .. లబ్ధిదారులకు నేరుగా ఫోటోలు అప్‌లోడ్ చేసే అవకాశం
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది. నిరుపేదలకు స్వగృహం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మూడు విడతల్లో ఇళ్లు మంజూరు చేయబోతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.

Ponguleti Srinivas Reddy : బీఆర్‌ఎస్ మోసాలపై త్వరలో రాజకీయ బాంబులు : మంత్రి పొంగులేటి
గుడ్ న్యూస్
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, ఈ సందర్భంగా పథకం వివరాలను వెల్లడించారు. మొదటి దశలో రూ.22,500 కోట్ల వ్యయంతో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.గత ప్రభుత్వం ప్రారంభించి పూర్తి చేయని 1,275 రెండు పడకగదుల ఇళ్లను ఇప్పటికే పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించినట్టు తెలిపారు.
అదేవిధంగా గద్వాల జిల్లాలో 687 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇప్పటివరకు ఇంటి నిర్మాణ దశల ఫోటోలను పంచాయతీ కార్యదర్శులు లేదా అధికారులే అప్‌లోడ్ చేస్తూ ఉండేవారు. దీంతో బిల్లుల చెల్లింపులో జాప్యాలు ఏర్పడేవి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లబ్ధిదారులే స్వయంగా తమ ఇంటి నిర్మాణ దశల ఫోటోలను ఇందిరమ్మ ఇళ్లు మొబైల్ యాప్ ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు. ఫోటోల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం, నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు