Ponguleti Srinivasa Reddy : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivasa Reddy : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. రేపు నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికలపై తేదీపై క్లారిటీ ఇస్తామని మంత్రి తెలిపారు.
Ponguleti Srinivasa Reddy : కీలక ప్రకటన..
కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయన్నారు. ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్న నేపత్యంలో… గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని సూచించారు. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.

Ponguleti Srinivasa Reddy : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఎన్నికలకు రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి…. మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం అవ్వండి. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది..వారం రోజుల్లో ‘రైతు భరోసా’, సన్నాలకు బోనస్ను రైతుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని చెప్పారు. అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.