Local Body Elections : బ్రేకింగ్.. తెలంగాణ లో ఎన్నికల పండగ మొదలుకాబోతుంది..!
ప్రధానాంశాలు:
బీసీ రిజర్వేషన్లు, కోర్టు ఆదేశాలతో తెలంగాణ లో ఎన్నికల హడావిడి స్టార్ట్
Local Body Elections : బ్రేకింగ్.. తెలంగాణ లో ఎన్నికల పండగ మొదలుకాబోతుంది..!
Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. గత సంవత్సరం కాలంగా సర్పంచ్ పదవులు ఖాళీగా ఉండటంతో గ్రామాల పాలనను ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. తాజా పరిస్థితుల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం నిర్వహించాల్సిన అవసరం రాష్ట్రంలో కనిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అనంతరం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.
Local Body Elections : బ్రేకింగ్.. తెలంగాణ లో ఎన్నికల పండగ మొదలుకాబోతుంది..!
Local Body Elections : తెలంగాణ లో ముందుగా MPTC ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు
ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ప్రధాన అంశంగా మారాయి. తెలంగాణ కేబినెట్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి ప్రత్యేక జీవో (ఆర్డినెన్స్) రూపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, తద్వారా న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసేలా చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా, ఇటీవల తెలంగాణ హైకోర్టు పంచాయతీ ఎన్నికలు మూడునెలల్లోపు నిర్వహించాలని స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పోలింగ్ సిబ్బంది వివరాలు, రిటర్నింగ్ అధికారుల సమాచారం, మండలాల వారీగా పంచాయతీలు, వార్డుల సంఖ్యలు వంటి వివరాలను అప్‌డేట్ చేయాలని కోరింది. ఇప్పటికే ఈసీ చేసిన కసరత్తుతో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆశావహుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.