Post Office Scheme : అదిరే పొస్టాఫీస్ స్కీమ్ .. ‌‌ లక్ష పెడితే రెండు లక్షలు రిటర్న్స్ ..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Post Office Scheme : అదిరే పొస్టాఫీస్ స్కీమ్ .. ‌‌ లక్ష పెడితే రెండు లక్షలు రిటర్న్స్ ..!

Post Office Scheme : ప్రస్తుత కాలంలో డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం కష్టపడేది డబ్బు కోసం. డబ్బు తోనే మన పొట్ట నింపుకోగలుగుతాం. పూర్వపు రోజుల్లో వస్తువులను ఇచ్చిపుచ్చుకొని ఆహార పదార్థాలను సేవించేవారు. కానీ ఇప్పుడు ప్రతిదీ డబ్బుతో కొనుక్కొని తినడమే. అందుకే డబ్బును దాచుకోవడం చాలా ముఖ్యం. డబ్బు ఉన్నప్పుడు ఖర్చు పెట్టడం కంటే దానిని దాచుకుంటే భవిష్యత్తులో ఏమైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి అనారోగ్య సమస్యలు, పిల్లల చదువులు […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 December 2022,6:00 pm

Post Office Scheme : ప్రస్తుత కాలంలో డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం కష్టపడేది డబ్బు కోసం. డబ్బు తోనే మన పొట్ట నింపుకోగలుగుతాం. పూర్వపు రోజుల్లో వస్తువులను ఇచ్చిపుచ్చుకొని ఆహార పదార్థాలను సేవించేవారు. కానీ ఇప్పుడు ప్రతిదీ డబ్బుతో కొనుక్కొని తినడమే. అందుకే డబ్బును దాచుకోవడం చాలా ముఖ్యం. డబ్బు ఉన్నప్పుడు ఖర్చు పెట్టడం కంటే దానిని దాచుకుంటే భవిష్యత్తులో ఏమైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి అనారోగ్య సమస్యలు, పిల్లల చదువులు వివాహాలకు డబ్బు అవసరం వస్తుంది. అందుకే డబ్బులు పొదుపు చేయడం ఉత్తమం. అందుకే ప్రభుత్వ రంగ సంస్థ పోస్ట్ ఆఫీస్ అందించే పొదుపు

పథకాలను ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రాబడి పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న అనేక పథకాల్లో ఒకటి కిసాన్ వికాస్ పత్ర ఒకటి. ఈ పథకంలో ఎంత అయితే పెట్టుబడి పెడతామో దానికి డబల్ అమౌంట్ ని రిటర్న్ గా పొందవచ్చు. కిసాన్ వికాస్ పత్ర పథకంలో లక్ష రూపాయల పెట్టుబడి పెడితే 2లక్షలు పొందవచ్చు. అదే రెండు లక్షలు పెట్టుబడి పెడితే నాలుగు లక్షలు తిరిగి పొందవచ్చు. అయితే సమయం ఎక్కువ పడుతుంది. కాస్త సమయం ఎక్కువైనా సరే ఈ పథకంలో మంచి రాబడిని పొందవచ్చు. ఈ పథకం జీవితకాలం 10 సంవత్సరాల నాలుగు నెలలు. ఇటీవల ఈ స్కీమ్ వడ్డీ రేటును కూడా పెంచింది.

post office scheme benefits

post office scheme benefits

గతంలో ఈ పథకలో 6.9% ఉన్న వడ్డీ 7% శాతానికి పెంచింది.  ఇలాంటి పథకాలను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వడ్డీ రేటును పెంచుతూ ఉంటుంది. మరి కొన్నిసార్లు వడ్డీని అలాగే ఉంచుతుంది. ఈ పథకంలో గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా పొదుపు చేయవచ్చు కానీ కనీస పెట్టుబడి రూ.1000 ఉండాలి. అలాగే 2000, 3000, 4000 ఇలా ఎంత డబ్బైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టిన పది సంవత్సరాల నాలుగు నెలలకు రెట్టింపు అవుతుంది. ఈ పథకంతో మంచి ఆదాయం రావడం గ్యారంటీ.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది