Post Office Scheme : ఈ పథకంలో చేరారంటే… లక్షకి 2 లక్షలు రావడం గ్యారెంటీ… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Post Office Scheme : ఈ పథకంలో చేరారంటే… లక్షకి 2 లక్షలు రావడం గ్యారెంటీ…

 Authored By prabhas | The Telugu News | Updated on :28 September 2022,7:00 am

Post Office Scheme : సంపాదించిన డబ్బులు దాచిపెట్టడం వలన భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు. సంపద దాచుకోవడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అందులో పోస్టల్ శాఖ అందించే కిసాన్ వికాస్ పత్ర ఒకటి. ఇందులో ఎటువంటి రిస్క్ ఉండదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను కోరుకునే వారికి ఈ కిసాన్ వికాస్ పత్ర మంచి మార్గం. సంవత్సరానికి ఒకసారి 124 నెలల పాటు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలను పొందవచ్చు. కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. ఏడాదికి 50,000 చొప్పున పదేళ్లపాటు పెట్టుబడి పెడితే పదేళ్ల తర్వాత 10 లక్షలు పొందవచ్చు.

పెట్టుబడి పెట్టింది ఐదు లక్షల అయితే దానికి రెట్టింపు డబ్బు వస్తుంది. ఏడాదికి 50,000 ఉంటే నెలకి 5000 కంటే తక్కువే అయితే 50 వేలకు పైగా పెట్టుబడి పెట్టాలనుకుంటే కచ్చితంగా పాన్ కార్డ్ కాపీ జత చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరిన వారికి కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ స్కీమ్ లో 6.9% వడ్డీ లభిస్తుంది. దీంతో పెట్టుబడి పదేళ్ల తర్వాత రెట్టింపు అవుతుంది. ఈ స్కీంలో చేరిన సమయంలో కేవీసీ సర్టిఫికెట్లు పేర్కొన్న వడ్డీ రేటును బట్టి మెచ్యూరిటీ నిర్ణయిస్తారు. భవిష్యత్తులో వడ్డీరేట్లు మారినప్పటికీ అది ఇన్వెస్టర్ లాభాలపై ప్రభావం చూపించదు. కేవీసి సర్టిఫికెట్లు వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీ మొత్తాన్ని చెల్లిస్తారు. 18 ఏళ్లు దాటిన వారు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. వయసు పరిమితి కూడా లేదు. వయోవృద్ధులు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

Post office scheme invest double in short time

Post office scheme invest double in short time

మైనర్ల పేరు మీద ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే మైనర్ల బదులు 18 ఏళ్లు దాటినవారు సర్టిఫికెట్ కొని 18 ఏళ్ల వచ్చేవరకు మ్యానేజ్ చేయాల్సి ఉంటుంది. మిగతా సేవింగ్స్ స్కీమ్స్ లా కాకుండా ఈ స్కీంలో పెట్టుబడి పెడితే ఎక్కువ కాలం ఆగకుండా అంటే పదేళ్లపాటు ఆగకుండా ముందుగానే మీరు చెల్లించిన మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఏడాది నుంచి రెండున్నరలోపు తీసుకోవాలనుకుంటే ఎటువంటి పెనాల్టీ ఉండదు. కానీ సర్టిఫికెట్లో చెప్పిన దానికంటే తక్కువ వడ్డీ వస్తుంది. రెండున్నర సంవత్సరాల తర్వాత మీరు చెల్లించిన డబ్బుని వెనక్కి తీసుకోవాలనుకుంటే ఎలాంటి పెనాల్టీ ఉండదు. పైగా వడ్డీ రేటు కూడా మారదు. సర్టిఫికెట్ లో ఎంత ఉంటే అదే వడ్డీ కలిపి మీ డబ్బులు పొందవచ్చు. ఈ పథకం కేవలం ఇండియాలో ఉండే వారికి వర్తిస్తుంది. ఎన్ఆర్ఐ లకు ఈ స్కీమ్ లో చేరే అవకాశం లేదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది