Post Office Scheme : నెలకు 10 వేలు కడితే చాలు.. ఒకేసారి 16 లక్షలు చేతికొస్తాయి.. ఆ స్కీమ్ ఏంటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Post Office Scheme : నెలకు 10 వేలు కడితే చాలు.. ఒకేసారి 16 లక్షలు చేతికొస్తాయి.. ఆ స్కీమ్ ఏంటో తెలుసా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 March 2022,7:00 pm

Post Office Scheme : ఈ మధ్య పోస్ట్ ఆఫీస్ లో చాలా రకాల స్కీమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. సాధారణంగా ప్రైవేట్ ఇన్సురెన్స్ కంపెనీలలో స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలామంది భయపడతారు కానీ.. పోస్ట్ ఆఫీస్ అనేసరికి.. ఏమాత్రం భయపడరు. టెన్షన్ పడరు. ఎందుకంటే అది ప్రభుత్వ రంగ సంస్థ. మన డబ్బు ఎక్కడికీ పోదు. అందులో పెట్టుబడి పెడితే.. బ్యాంకులో డబ్బు దాచుకున్నట్టే. చాలామంది పోస్టాఫీసు స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో పోస్టాఫీసు నుంచి కూడా పలు రకాల స్కీమ్ లను ప్రవేశపెడుతున్నారు.

పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్ తో పాటు.. పోస్టాఫీసు రిక్కరింగ్ డిపాజిట్ అకౌంట్ ను కూడా ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీసు ఆర్డీ స్కీమ్ ద్వారా… కట్టే ప్రతి రూపాయికి వడ్డీ లభించడంతో పాటు.. డబ్బు సురక్షితంగా ఉంటుంది.నెలనెలా కొంత అమౌంట్ ను పెట్టుబడి కోసం ఉపయోగించాలనుకుంటే.. పోస్టాఫీసు ఆర్డీ స్కీమ్ బెస్ట్ ఆప్షన్. అందులోనూ పోస్టాఫీసులో బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి.పోస్టాఫీసు ఆర్డీ స్కీమ్ లో ఎంత అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. నెలకు 100 రూపాయల నుంచి గరిష్ఠంగా ఎంత డబ్బు అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో కనీసం వడ్డీ రేటు 5.8 శాతం ఉంటుంది. కేంద్ర నుంచి వచ్చిన వడ్డీ శాతం అది. వడ్డీ రేట్లను కేంద్రం అప్పుడప్పుడు మారుస్తుంటుంది.

post office scheme to invest 10000 per month and get 16 lakh in return

post office scheme to invest 10000 per month and get 16 lakh in return

Post Office Scheme : నెలకు 100 రూపాయలు కూడా పెట్టుబడి పెట్టొచ్చు

ఒకవేళ ఈ స్కీమ్ ప్రకారం మీరు నెలకు 10 వేలు కడుతూ వెళ్తే.. 5.8 శాతం వడ్డీ ప్రకారం.. 10 ఏళ్లలో ఒకేసారి 16 లక్షల రూపాయలు మీ చేతికి అందుతాయి. ఎందుకంటే.. ఇందులో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ను లెక్కిస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. అదే ఎక్కువ వడ్డీని అందిస్తుంది. అందుకే చాలామంది ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.మీకు కూడా ఈ స్కీమ్ లో చేరాలనే ఇంట్రెస్ట్ ఉంటే.. వెంటనే మీ దగ్గర్లోని పోస్టాఫీసును సంప్రదించండి. మరిన్ని వివరాలను వాళ్లను అడిగి తెలుసుకోండి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది