Prabhas Raja Saab : స్టార్ సినిమాను మొదలు పెట్టడం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం చాలా సులువే కానీ ఆ టైం కు ఆడియన్స్ ముందుకు సినిమా తీసుకు రావడం మాత్రం చాలా కష్టం. ప్రసుతం స్టార్ హీరోలు చేస్తున్న ఎన్నో సినిమాలు ఒక డేట్ కి అనుకుని మరో డేట్ కి షిఫ్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ లిస్ట్ లో కొత్తగా రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ కూడా చేరుతుందని టాక్. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
ఈ సినిమాలో మలయాళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రాజా సాబ్ సినిమాను అసలైతే ఏప్రిల్ 10, 2025న రిలీజ్ లాక్ చేశారు. ఐతే ప్రభాస్ మరోపక్క స్పిరిట్, ఫౌజి సినిమాలకు డేట్స్ ఇచ్చాడు. ప్రభాస్ లేని ఎపిసోడ్స్ చేస్తూ ప్రభాస్ డేట్స్ ఇచ్చినప్పుడు రాజా సాబ్ చేస్తున్నాడు మారుతి. ఈ క్రమంలో రాజా సాబ్ షూటింగ్ లేట్ అవుతుందని టాక్. అందుకే ఏప్రిల్ 10కి రాజా సాబ్ రిలీజ్ కష్టమే అని అంటున్నారు.
రాజా సాబ్ సినిమాకు ఇంకా సీజీ వర్క్ చాలా చేయాల్సి ఉందట. మెయిన్ గా రెండు ఎపిసోడ్స్ భారీగా సీజీ వర్క్ తో కూడుకున్నవి ఉన్నాయట. వాటి కోసం కొంత టైం పడుతుందట. అందుకే ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు. అందుకే మారుతి కూడా రిలాక్స్ అయిపోయాడని తెలుస్తుంది.
ప్రభాస్ ఫౌజి ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. స్పిరిట్ డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్తుంది. 2026లో ప్రభాస్ ఎట్టి పరిస్థితుల్లో రెండు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.
Bangladesh : బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఇస్కాన్ కోల్కతా తిలకం తుడిచివేయాలని మరియు తులసి పూసలను దాచుకోవాలని, తలలు…
Hemant Soren : జార్ఖండ్లో ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల తర్వాత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాత్రమే మంత్రిగా…
Donald Trump : తాను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా…
Rashmika Mandanna : ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే రష్మిక ఇప్పుడు దారుణంగా అందాలు ఆరబోస్తుంది. స్కిన్ షో విషయంలో…
Tollywood : డిసెంబర్ 5న పుష్ప2 Pushpa 2 చిత్రం విడుదల కానుండగా డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర ఫైట్ జరగుతుంది. టాప్ 5 కోసం…
Farmers : అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతే వారికి ఈ వర్షాల వల్ల పంట…
Lipstick : ప్రస్తుత కాలంలో చాలామంది లిప్ స్టిక్ లేకుండా అస్సలు ఉండలేరు. అయితే ఈ లిప్ స్టిక్ ను పెదవులు…
This website uses cookies.