Prashant Kishor : వైఎస్ షర్మిలకు షాక్.. ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం..?
Prashant Kishor : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. దీంతో ఆ పార్టీ గెలిచింది. ప్రశాంత్ కిషోర్… ఏ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసినా ఆ పార్టీ గెలవాల్సిందే. తాజాగా పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆయన వ్యూహకర్తగా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ లో పార్టీ విజయడంకా మోగించింది. అలాగే తమిళనాడులో డీఎంకే పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించారు. అక్కడ కూడా డీఎంకే పార్టీ విజయదుందుబి మోగించింది. అందుకే… ప్రశాంత్ కిషోర్ ఎక్కడ కాలుపెడితే… ఏ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసినా… అక్కడి ప్రత్యర్థ పార్టీలకు పరాజయమే. అందుకే… ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా సంచలనం అయ్యారు.
ఓవైపు మమతా బెనర్జీ పార్టీ టీఎంసీని మరోసారి గెలిపించిన ప్రశాంత్ కిషోర్… ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సంస్థ అయిన ఐపాక్ నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఐపాక్ సంస్థలో ప్రశాంత్ కిషోర్.. ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు తాజాగా ప్రకటించారు.
Prashant Kishor : జీవితంలో ఇంకేదో చేయాలి.. వ్యూహకర్తగా ఇక చాలు
ఈసందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ… ఇక నేను వ్యూహకర్తగా ఉండాలనుకోవడం లేదు. వ్యూహకర్తగా చేయాల్సిన పని చేశాను. ఇప్పుడు నేను విరామం తీసుకోవాలి. ఇంకేదో చేయాలి. జీవితంలో ఇంకేదో చేయాలి అనిపిస్తోంది. అందుకే వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా.. అని ప్రశాంత్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఒకవేళ మీరు రాజకీయాల్లోకి ఏమైనా వస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా… నేను రాజకీయాల్లో ఓడిపోయాను. మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లను. భవిష్యత్తులో ఏం చేయాలి.. అనే దానిపై ఇంకా ఆలోచించలేదు. ప్రస్తుతం ఐపాక్ సంస్థలో సమర్థమైన టీమ్ ఉంది. వాళ్లు సంస్థను ముందుకు తీసుకెళ్తారు… అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
Prashant Kishor : వైఎస్ షర్మిల పరిస్థితి ఏంటి?
ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ తప్పుకోవడంతో వైఎస్ షర్మిల పరిస్థితి ఏంటని అందరూ అంటున్నారు. ఎందుకంటే.. వైఎస్ షర్మిల అన్న పార్టీ వైఎస్సార్సీపీని గెలిపించింది ప్రశాంత్ కిషోరే. రేపు.. వైఎస్ షర్మిల పార్టీ పెడితే.. ఆ పార్టీకి కూడా ప్రశాంత్ కిషోర్… వ్యూహకర్తగా ఉంటారని… 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్.. వైఎస్ షర్మిల పార్టీకి పని చేసి… వైఎస్ షర్మిల పార్టీని తెలంగాణలో గెలిపిస్తారని.. దానికి ప్రశాంత్ కిషోర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం ఆయన ఏకంగా వ్యూహకర్తగానే తప్పుకోవడం సంచలనంగా మారింది. మరి… వైఎస్ షర్మిల పరిస్థితి ఏంటి? ఆయన్ను నమ్ముకొని షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుంటే… ఆయన వ్యూహకర్తగా తప్పుకోవడం… షర్మిలకు పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి.