Prashant Kishore : వైయస్ జగన్ విషయంలో ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యావయ్య ప్రశాంత్ కిషోర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prashant Kishore : వైయస్ జగన్ విషయంలో ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యావయ్య ప్రశాంత్ కిషోర్..!

Prashant Kishore : రీసెంట్ గా ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా ఓడిపోతారని అందుకు ఇవే కారణాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ప్రశాంత్ కిషోర్ ఒక లాజిక్ మర్చిపోతున్నారని అంటున్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న నాయకులంతా రాష్ట్రాన్ని ఆర్థికంగా కృంగదీస్తున్నారనే విషయాన్ని మరిచిపోతున్నారు. ప్రజల డబ్బులు సంక్షేమ పథకాలతో ఇష్టం వచ్చినట్లుగా పంచుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేది కూడా తప్పే. […]

 Authored By tech | The Telugu News | Updated on :5 March 2024,2:20 pm

ప్రధానాంశాలు:

  •  Prashant Kishore : వైయస్ జగన్ విషయంలో ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యావయ్య ప్రశాంత్ కిషోర్..!

Prashant Kishore : రీసెంట్ గా ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా ఓడిపోతారని అందుకు ఇవే కారణాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ప్రశాంత్ కిషోర్ ఒక లాజిక్ మర్చిపోతున్నారని అంటున్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న నాయకులంతా రాష్ట్రాన్ని ఆర్థికంగా కృంగదీస్తున్నారనే విషయాన్ని మరిచిపోతున్నారు. ప్రజల డబ్బులు సంక్షేమ పథకాలతో ఇష్టం వచ్చినట్లుగా పంచుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేది కూడా తప్పే. ప్రజల పరిస్థితులను మెరుగుపరిచేలా చేసుకోవాలి. ప్రజలకు మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు, నిత్యవసర వస్తువులు ధరలు తగ్గింపు ఇలాంటివి చేయాలి కానీ సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాలను ఆర్థికంగా కృంగతీస్తున్నారు. ఓట్ల కోసం ఉచిత పథకాలు ఇవ్వడం ఏమాత్రం సరైనది కాదు అని కొందరు భావిస్తున్నారు.

ఇక ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కనిపించడం లేదు. ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అందుకే వైయస్ జగన్ కచ్చితంగా ఓడిపోతారని చెబుతున్నారు. అయితే తెలంగాణలో కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. మరోపక్క సంక్షేమ పథకాలు కూడా ఇచ్చారు. కానీ ఆయన ఓడిపోయారు. కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందని పరిస్థితి. ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకం అందేలా చేశారు. అయితే ప్రశాంత్ కిషోర్ మర్చిపోతున్న లాజిక్ ఏంటంటే అసలు ఈ ఉచిత పథకాలను పట్టుకొచ్చిందే ఆయన. కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి వాళ్లకి ఉచిత పథకాల సలహా ఇచ్చింది ప్రశాంత్ కిషోరే. తెలంగాణ, కర్ణాటకలో కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఉచిత పథకాలే అమలు అయ్యాయి. ఈ ఉచిత పథకాల వలన ఆర్థికంగా రాష్ట్రం వెనుకపడుతుంది. వీలైతే నిత్యవసర ధరలు, టికెట్ రేట్లు తగ్గించాల్సి ఉంటుంది. కానీ ఇలా ఉచిత పథకాల వలన రాష్ట్రానికి ఏ మాత్రం న్యాయం జరిగింది కాదు.

ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి నవరత్నాలు పేరిట ఉచిత పథకాల ఆలోచన ఇచ్చిందే ప్రశాంత్ కిషోర్. అధికారంలోకి రావడం కోసం ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ గా, గొప్పోడు లాగా ఉచిత పథకాల సలహా ఇచ్చి రాష్ట్రాలను ఆర్థికంగా కృంగతీస్తున్నారు. ఇలాంటి పథకాలను పెట్టమని వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయన గెలవడని వ్యాఖ్యానించడం, విమర్శించడం ఏమాత్రం సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి కాకపోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాటా ఎంత ఉందో ప్రశాంత్ కిషోర్ వాటా కూడా అంతే ఉంది. ఆయన ఇచ్చిన ఈ దిక్కుమాలిన ఉచిత పథకాల సలహాల వలన రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయింది అని అంటున్నారు. ఈ ఉచిత పథకాల వలన రాష్ట్రం అభివృద్ధి కాదు కదా తిరోగమనము లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా నాయకులంతా ఈ ఉచిత పథకాలు ఆపేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది