Moon : ఫుల్ క్లారిటీతో చంద్రుడి ఫోటోను దించి… రికార్డు క్రియేట్ చేసిన 16 ఏళ్ల కుర్రాడు.. ఆ ఫోటో చూస్తే మీరు అవాక్కవ్వాల్సిందే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Moon : ఫుల్ క్లారిటీతో చంద్రుడి ఫోటోను దించి… రికార్డు క్రియేట్ చేసిన 16 ఏళ్ల కుర్రాడు.. ఆ ఫోటో చూస్తే మీరు అవాక్కవ్వాల్సిందే?

Moon : చందమామ రావే.. జాబిల్లి రావే.. అని మనం చిన్నప్పుడు పాడుకునే వాళ్లం. అమ్మ కూడా మనం మారాం చేస్తే.. అన్నం తినకపోతే.. అదిగో చందమామ అంటూ.. చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది. మనం చూసే చందమామ వేరు.. అసలు చందమామ వేరు. ఎందుకంటే.. మనం చూసే చందమామ.. ఎన్నో కోట్ల మైళ్ల దూరంలో ఆకాశంలో ఉంటుంది. దాన్ని మనం చూస్తే.. మనకు చిన్నగా కనిపిస్తాడు కానీ.. చందమామ కూడా ఇంచుమించు మన భూమి అంత […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 May 2021,2:33 pm

Moon : చందమామ రావే.. జాబిల్లి రావే.. అని మనం చిన్నప్పుడు పాడుకునే వాళ్లం. అమ్మ కూడా మనం మారాం చేస్తే.. అన్నం తినకపోతే.. అదిగో చందమామ అంటూ.. చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది. మనం చూసే చందమామ వేరు.. అసలు చందమామ వేరు. ఎందుకంటే.. మనం చూసే చందమామ.. ఎన్నో కోట్ల మైళ్ల దూరంలో ఆకాశంలో ఉంటుంది. దాన్ని మనం చూస్తే.. మనకు చిన్నగా కనిపిస్తాడు కానీ.. చందమామ కూడా ఇంచుమించు మన భూమి అంత ఉంటాడు. కానీ.. మనకు మాత్రం అంత చిన్నగా, తెల్లగా కనిపిస్తాడు కానీ..చంద్రుడు తెల్లగా ఉండడు. అసలు.. చంద్రుడిని దగ్గర నుంచి ఎవరైనా చూస్తే కదా. ఒకరిద్దరు చంద్రుడి దగ్గరికి వెళ్లి వచ్చారు కానీ.. పూర్తిగా చంద్రుడిని దగ్గర్నుంచి ఫోటోలు తీసిన వాళ్లు అయితే లేరు.

prathamesh jaju clicked the clearest pictures of moon

prathamesh jaju clicked the clearest pictures of moon

అందుకేనేమో.. పూణెకు చెందిన 16 ఏళ్ల ప్రతమేష్ జజు అనే కుర్రాడు.. భూమి మీద ఉండే.. చంద్రుడిని చాలా క్లియర్ గా ఫోటోలు తీసి చూపించాడు. ఆ ఫోటోలు చూస్తే మనం కూడా కెవ్వుమనాల్సిందే. అంత క్లియర్ గా ఉన్నాయి ఆ ఫోటోలు. అసలు.. ఆ ఫోటోలు చూస్తే.. చంద్రుడు మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. చంద్రుడి క్లారిటీ ఫోటోలు తీయడం కోసం ప్రతమేష్ సపరేట్ కెమెరానే తయారు చేసుకున్నాడు. దాన్ని జూమ్ చేసి జూమ్ చేసి.. కనీసం 100 జీబీల మెమోరీలో పట్టే అన్ని చంద్రుడి ఫోటోలను తీసి.. వాటిని ప్రాసెస్ చేస్తే అవి 186 జీబీల డేటా అవుతుందట. అప్పుడు ఆ ఫోటోలను అన్నింటిని కంప్రెష్ చేస్తే.. అప్పుడు 600 ఎంబీల మెమోరీతో చంద్రుడి ఫోటోలు ఉన్న ఫైల్ వస్తుందట.

prathamesh jaju clicked the clearest pictures of moon

prathamesh jaju clicked the clearest pictures of moon

Moon : చంద్రుడి ఫోటోల కోసం రాత్రి 1 గంటకు డాబా పైకి ఎక్కి

మే 3న రాత్రి 1 గంటకు చంద్రుడి ఫోటోలను ప్రత్యేక కెమెరాతో తీశాడట జజు. రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 4 గంటల వరకు ఏకధాటిగా వీడియోలను, ఫోటోలను చిత్రీకరించాడట ప్రతమేష్. ఆ తర్వాత ఆ ఫోటోలను ప్రాసెస్ చేయడానికి రెండు రోజులు సమయం పట్టిందట. మొత్తం చంద్రుడికి సంబంధించిన 50 వేల ఫోటోలను ప్రతమేష్ క్లిక్ మనిపించాడట. అన్ని ఫోటోలను ఏరగా.. ఏరగా.. చంద్రుడి క్లియర్ ఫోటోలు కొన్ని బయటికి వచ్చాయట.

prathamesh jaju clicked the clearest pictures of moon

prathamesh jaju clicked the clearest pictures of moon

ఇక.. చంద్రుడి క్లియర్ ఫోటోను తీయడం కోసం.. ప్రతమేష్ బాగానే రీసెర్చ్ చేశాడట. యూట్యూబ్ లో వీడియోలు చూడటంతో పాటు.. కొన్ని ఆర్టికల్స్ చదవి.. ఇంటర్నెట్ లోనూ వెతికి.. రీసెర్చ్ చేసి చంద్రుడి ఫోటోలను తీశాడట. ఏది ఏమైనా.. మనోడు తీసిన చంద్రుడి ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ ఇంత క్లియర్ గా ఉన్న చంద్రుడి ఫోటోలను చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

prathamesh jaju clicked the clearest pictures of moon

prathamesh jaju clicked the clearest pictures of moon

prathamesh jaju clicked the clearest pictures of moon

prathamesh jaju clicked the clearest pictures of moon

prathamesh jaju clicked the clearest pictures of moon

prathamesh jaju clicked the clearest pictures of moon

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది