ఏడాది వయసు చిన్నారికి 16 కోట్ల విలువైన ఇంజెక్షన్.. అయినా కూడా..!
Maharashtra : ఏడాది వయసు ఉన్న చిన్నారి.. అరుదైన వ్యాధితో బాధపడింది. వంశపారపర్యంగా వచ్చే అరుదైన వ్యాధి అది. దానికి చికిత్స లేదు. కానీ.. 16 కోట్ల రూపాయల విలువైన ఓ ఇంజెక్షన్ వేస్తే మత్రం ఆ పాపకు నయం అయ్యే చాన్సెస్ ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ పాప తల్లిదండ్రులు ఎందరినో డబ్బులు అడిగారు. ఉన్నది అమ్ముకున్నారు. బంధువులు, స్నేహితులు, డొనేషన్స్.. ఇలా ఎంతో కష్టపడి.. చివరకు 16 కోట్ల రూపాయల విలువైన ఆ ఇంజెక్షన్ ను పాపకు వేయించారు. దీంతో పాప బతుకుతుందిలే.. డబ్బుది ఏముంది.. ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు.. అని అనుకున్నారు పాప తల్లిదండ్రులు. కానీ.. విధి విచిత్రమైనది.
ఎందుకంటే.. ఆ పాపను 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ కూడా కాపాడలేకపోయింది. తను ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయింది. ఆ పాప పేరు వేదిక షిండే. తనది మహారాష్ట్రలోని పూణె. తనకు స్పైనల్ మస్క్యూలర్ అట్రోపీ అనే వ్యాధి ఉంది. ఎస్ఎంఏ టైప్ 1 అని అంటారు ఆ వ్యాధిని. ఆ వ్యాధి వస్తే చికిత్స ఏం ఉండదు కానీ.. ఒక్క ఇంజెక్షన్ వేస్తే బతికే చాన్సెస్ ఉంటాయని తెలుసుకొని 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ను వేదికకు ఇప్పించారు. అయినా కూడా పాప ప్రాణాలు నిలవలేదు.
Maharashtra : సోషల్ మీడియాలో ప్రచారం ద్వారా 14 కోట్ల డొనేషన్స్ వచ్చాయి
కేవలం సోషల్ మీడియాలో పాప చికిత్స కోసం ఇంజెక్షన్ కు డొనేషన్స్ కావాలని ప్రచారం చేయడంతో.. కేవలం సోషల్ మీడియా ద్వారానే పాపకు 14 కోట్ల రూపాయల డొనేషన్స్ వచ్చాయి. దీంతో తనకు అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ ను పూణెలోని డాక్టర్లు వేశారు. తర్వాత పాప కోలుకుంది. కొన్ని రోజులు బాగానే ఉంది. తనకు చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా పాపతో తన తల్లిదండ్రులు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ తర్వాత తనకు శ్వాస తీసుకోవడంలో సమస్య వచ్చి వెంటనే తను అపస్మారక స్థితికి చేరుకొని చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు.