India : ఇండియాలో పూజారి, ఇంగ్లాండ్ లో బిషప్ అయ్యాడు…!
India : ఇండియా లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో బిషప్‌గా నియమితులయ్యారు. సాజు అనే పేరుతో ఇంగ్లాండ్ లో సెటిల్ అయిన రెవరెండ్ మలయిల్ లూకోస్ వర్గీస్ ముత్యాలల్లి… చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో అతి చిన్న వయసు బిషప్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 42 ఏళ్ల సాజు లాఫ్‌బరో తదుపరి బిషప్‌గా మారడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్‌లో మంగళవారం కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్ ద్వారా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ క్వీన్ ఎలిజబెత్ II సిఫారసు ప్రకారం ఆయన్ను నియమించారు. కేరళలో జన్మించిన సాజు ఆ తర్వాత బెంగళూరు కి వెళ్లి అక్కడే చిన్న తనంలో విద్యాభ్యాసం కొనసాగించాడు. ఆ తర్వాత సరిగా 21 ఏళ్ళ క్రితం యూకే వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

priest in india became bishop in england
ప్రస్తుతం రోచెస్టర్ డియోసెస్‌లోని సెయింట్ మార్క్స్, గిల్లింగ్‌హామ్ మరియు సెయింట్ మేరీస్ ద్వీపంలో వికార్‌గా పనిచేస్తున్నాడు. 2009లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ప్రీస్ట్‌గా బాధ్యతలు నిర్వహించాడు. నలుగురు పిల్లలకు తండ్రైన సాజు ఈ బాధ్యతలు చేపట్టడం పట్ల ఆయన ముందు తరాల వారు అభ్యంతరం వ్యక్తం చేసారని అయినా సరే ముందుకు వెళ్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది.