Mutton Soup Recipe : మటన్ బోన్స్ సూప్ ఇలా చేశారంటే టేస్ట్ అదుర్స్!!
Mutton Soup Recipe : మటన్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. చికెన్ లో కంటే మటన్ లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే అప్పుడప్పుడు మటన్ తినాలి. కేవలం మటన్ నే కాకుండా మటన్ సూప్ తాగితే ఎముకలు బలంగా ఉంటాయి. బోన్స్ బలహీనంగా ఉన్నవారు ఈ మటన్ సూప్ ను తయారు చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీనిని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాకుండా డైరెక్ట్ గా కూడా త్రాగవచ్చు. ఎలా తిన్నా ప్రయోజనం ఉంటుంది. అయితే బోన్స్ మటన్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
కావలసిన పదార్థాలు: 1) బోన్స్ మటన్ 2) అల్లం వెల్లుల్లి 3) పచ్చిమిర్చి 4) ఉప్పు 5) కారం 6) ధనియాలు 7) మిరియాలు 8) దాల్చిన చెక్క 9)బిర్యానీ ఆకు 10)కొత్తిమీర 11) పసుపు 12) వాటర్ 13) ఆయిల్ 14) నెయ్యి 15) జొన్నపిండి.. తయారీ విధానం : ముందుగా కొద్దిగా అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలను, రెండు, మూడు పచ్చిమిర్చిలను అచ్చాపచ్చగా దంచుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో శుభ్రం చేసిన అరకేజీ మటన్ బోన్స్ ను తీసుకోవాలి. తర్వాత 750 మీ.లి వాటర్ ను, రెండు స్పూన్ల ఉప్పును వేసుకొని హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, రెండు దంచిన యాలకులు, రెండు లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, వన్ టేబుల్ స్పూన్ మిరియాలు, సగం బిర్యానీ ఆకు, ఒక కట్ట కొత్తిమీర కాడలు, లీటర్ నీళ్లు, ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చి మిర్చీలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మంటను సిమ్ లో పెట్టి 6, 7 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
తరువాత మూత తీసి మరో లీటర్ నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ లో 40 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ అల్లం తురుము, రెండు టీ స్పూన్ల వెల్లుల్లి తురుము, తురిమిన పచ్చిమిర్చి వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల జొన్నపిండి వేసుకోవాలి. తర్వాత ఇందులో అర టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న మటన్ సూప్ ను వడకట్టుకోవాలి. మిగిలిన మటన్ బోన్స్ను దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్లిక్ చేస్తే ఎంతో టేస్టీ టేస్టీ మటన్ సూప్ రెడీ… మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.
