Begumpet | హైదరాబాద్‌ బేగంపేట శ్మశాన వాటికలో వ్యభిచార గృహం .. అవాక్కైన‌ స్థానికులు

Authored By Sam C | The Telugu News | Updated on : 13 September 2025, 4:00 pm

Begumpet | హైదరాబాద్‌ నగరంలో ఒక సంచలనకర ఘటన వెలుగులోకి వచ్చింది. పవిత్రంగా భావించే శ్మశాన వాటికను కొందరు అసాంఘిక శక్తులు అనుచిత కార్యకలాపాలకు వేదికగా మార్చేసినట్టు వెల్లడైంది. ఈ ఘటన బేగంపేట పోలీసులను, స్థానికులను కూడా ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.

#image_title

శ్మశానాన్ని అడ్డాగా మార్చిన ముఠా

బేగంపేటలోని శ్యాం లాల్ బిల్డింగ్స్ సమీపంలో ఉన్న ఒక శ్మశాన వాటికలో గదిని అద్దెకు తీసుకుని, అక్కడే వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యభిచార గృహాన్ని మాధవి అనే మహిళ నిర్వహిస్తూ, యువతులను తీసుకొచ్చి విటులతో అక్రమ సంబంధాలు కలిపే కార్యకలాపాలు నడిపినట్టు పోలీసులు వెల్లడించారు.

విశ్వసనీయ సమాచారం ఆధారంగా బేగంపేట పోలీసులు పక్కా ప్రణాళికతో శ్మశాన వాటికపై దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలు మాధవి, మరో యువతి మరియు ఒక విటుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో, పట్టుబడిన విటుడు సివిల్ కాంట్రాక్టర్ అని గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని వ్యభిచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇంకా ఇందులో ఇతరుల పాత్ర ఉందా? మరో ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.

Advertisement

Sam C

No bio available for this author.

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి