YS Jagan : వచ్చేది వైయస్ జగన్ ప్రభుత్వమే సామాన్యుడు ధీమా వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : వచ్చేది వైయస్ జగన్ ప్రభుత్వమే సామాన్యుడు ధీమా వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :28 May 2023,5:00 pm

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీ వర్సెస్ తెలుగుదేశం మరియు మిగతా పార్టీలు అన్న రీతిలో పోటీ కనిపిస్తుంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ నీ ఓడించాలంటే కచ్చితంగా అందరూ కలవాల్సిందే అన్న రీతిలో ప్రతిపక్షాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో బీజేపీ సైతం కలిసే అవకాశాలు ఉన్నాయని 2014 మాదిరిగా…

ap cm ys jagan comments about ap development

ap cm ys jagan comments about ap development

బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు కలసి పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనం నాడి తెలుసుకోవడానికి వెబ్ మీడియా ఛానల్స్ రకరకాల ఇంటర్వ్యూలు.. సర్వేలు చేస్తూ ఉన్నాయి. తాజాగా ఓ వెబ్ మీడియా ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో సామాన్యుడు సీఎం జగన్ పాలన పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే జగన్ పాలన అద్భుతంగా ఉందని చెప్పారు. ప్రజల వద్దకే పాలన తీసుకురావడం జరిగిందని స్పష్టం చేశారు.

Public Superb Words About CM YS Jagan AP Politics Public Opinion

Public Superb Words About CM YS Jagan AP Politics Public Opinion

ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి పని అయినా సచివాలయం వ్యవస్థ ద్వారా చాలా సులువుగా జరిగిపోతుందని తెలియజేశారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదవారికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు అన్నట్టు సోమరిపోతులు ఎవరు అవ్వడం లేదని… పేదవాళ్ళకి జగన్ అందిస్తున్న పథకాలు వల్ల ఎన్నో మేలులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో కూడా జగన్ మళ్ళీ గెలుస్తారని సదరు సామాన్యుడు తెలియజేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది