Borugula Laddu Recipe : పాత కాలపు స్టైల్ లో.. బొరుగుల లడ్డు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Borugula Laddu Recipe : పాత కాలపు స్టైల్ లో.. బొరుగుల లడ్డు..!

 Authored By prabhas | The Telugu News | Updated on :12 October 2022,7:30 am

Borugula Laddu Recipe : స్వీట్స్ ను ఎవరైనా ఇష్టపడతారు. అయితే బొరుగులతో చేసిన లడ్డు ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే వీటిని ఎంతగానో ఇష్టపడతారు. కానీ ప్రస్తుత కాలంలో ఈ బొరుగుల లడ్డూలు ఎక్కడ కనిపించడం లేదు. మన పాతకాలం వాళ్ళు బురుగులతో స్వీట్ ని చేసి పిల్లలకు తినిపించేవారు. ఈ బురుగుల లడ్డు ఎంతో టేస్టీగా అందరూ ఇష్టపడేలా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం బొరుగుల లడ్డును ఎలా తయారు చేసుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1) బొరుగులు 2) బెల్లం 3)

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు కప్పుల బొరుగులు తీసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. బొరుగుల లడ్డుకి రెండు ఇంగ్రిడియంట్స్ మాత్రమే అవసరం పడతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనం తీసుకున్న కప్పు బెల్లం కడాయిలో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి సన్న మంట మీద ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకుంటే బెల్లం టేస్ట్ మారిపోతుంది. కాబట్టి సన్న మంట మీద బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం నీళ్లను ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వలన తినేటప్పుడు రాళ్లు నలకలు తగలవు.

Borugula Laddu Recipe in telugu

Borugula Laddu Recipe in telugu

ఇలా వడకట్టుకున్న బెల్లం నీళ్ళను అదే కడాయిలో వేసుకోవాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఈ బెల్లం పాకం తయారు చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి బెల్లాన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పాకం చూడటానికి ఒక ప్లేట్ లో వాటర్ తీసుకుని బెల్లాన్ని కొద్దిగా తీసి వాటర్ లో వేస్తే ముద్ద కడితే పాకం రెడీ అయినట్లు. అలా కాకపోతే ఒక రెండు నిమిషాలు మళ్లీ పాకం పట్టుకోవాలి. పాకం రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి బొరుగులను ఇందులో వేసి కలుపుతూ ఉండాలి. కొద్దికొద్దిగా బొరుగులు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. బాగా కలిపిన తరువాత వేడి మీద గుండ్రంగా చేసుకోవాలి. చేతికి కొద్దిగా నీళ్లు అంటించుకొని లడ్డు లాగా చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన బొరుగుల లడ్డులు రెడీ.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది