BJP : పురందేశ్వరికి మరో ఝలక్ ఇచ్చిన బీజేపీ.. పదవి ఇవ్వడం పక్కన పెడితే ఉన్నదే తీసేశారు
BJP : వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ తమ జెండా పాతాలి. ఇదే ప్రస్తుతం బీజేపీ లక్ష్యం. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేసేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది. నిజానికి.. ఏపీలో ఉన్న నాయకుల్లో సమర్థులు ఎవరో.. అసమర్థులు ఎవరో తెలుసుకునే పనిలో పడింది బీజేపీ. ప్రస్తుతం దగ్గుబాటి పురందేశ్వరి పరిస్థితి కూడా అలాగే ఉంది. తను ఇప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తారని అంతా అనుకున్నా.. రాజ్యసభ సీటు దక్కలేదు.
ఇటీవల ఏపీ నుంచి కొందరికి బీజేపీ రాజ్యసభ సీటును ఇచ్చింది కానీ… పురందేశ్వరికి కేటాయించలేదు. అంతే కాదు.. ఇప్పుడు బీజేపీ పురందేశ్వరికి మరో షాక్ ఇచ్చింది. ఉన్న పదవుల నుంచి కూడా తనను తప్పించింది బీజేపీ హైకమాండ్. గత సంవత్సరం ఛత్తీస్ ఘడ్, ఒడిశా ఇన్ చార్జి బాధ్యతలను తనకు అప్పగించిన విషయం తెలిసిందే. ఇటీవల ఒడిశా బాధ్యతల నుంచి బీజేపీ హైకమాండ్ ఇటీవల తప్పించింది.
BJP : తాజాగా ఛత్తీస్ ఘడ్ బాధ్యతలనూ తప్పించిన బీజేపీ
అయితే.. తాజాగా ఛత్తీస్ ఘడ్ బాధ్యతల నుంచి కూడా బీజేపీ పురందేశ్వరిని తప్పించింది. ఆమెను తప్పించి.. రాజస్థాన్ కు చెందిన ఓం మాధర్ ను బీజేపీ ఇన్ చార్జ్ గా నియమించింది. తనను ఉన్న పదవుల నుంచి తప్పించడానికి కారణం… ఆమె పనితీరు. వచ్చే సంవత్సరం ఛత్తీస్ ఘడ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఆమె పనితీరు సరిగ్గా లేవడంతో వెంటనే ఇన్ చార్జిని మార్చాలని నిర్ణయించింది. నిజానికి.. పురందేశ్వరి పార్టీ పట్ల అంకితభావంతోనే పనిచేస్తున్నా ఎందుకు తనను బాధ్యతల నుంచి తప్పిస్తున్నారో తెలియడం లేదు. అయితే.. ఆమె గత కొన్ని రోజుల నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. అక్కడి స్థానిక నేతలకు కూడా ఆమె అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయం హైకమాండ్ కు చేరడంతో ఆమెను ఒడిశాతో పాటు ఛత్తీస్ గఢ్ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. ప్రస్తుతానికి ఆమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రం కొనసాగుతున్నారు.