Radhe shyam Pre Teaser : రాధేశ్యామ్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ కోసం రెడీ గా ఉండండి అంటూ మేకర్స్ భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. రాధేశ్యామ్ నుంచి దేశం అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న టీజర్ ఈ నెల 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రీ టీజర్ చూస్తుంటే ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్ లో ఏ సినిమాలో చూపించని విధంగా దర్శకుడు రాధాకృష్ణ చూపించబోతున్నట్టు అర్థమవుతోంది. ఇక మేకర్స్ తాజాగా ‘గెట్ రెడీ ఫర్ ది బిగ్గెస్ట్ లవ్ అనౌన్స్‌మెంట్’ అంటూ ప్రీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ ప్రీ టీజర్ అద్భుతంగా ఉందంటూ అప్పుడే డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ హడావుడి మొదలు పెట్టారు.
radhe shyam movie pre teaser
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న రాధేశ్యామ్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ యూరప్ కి చెందిన వింటేజ్ కార్ల వ్యాపారిగా.. రిచ్ బిజినెస్ మేన్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక పూజా హెగ్డే ఒక సాధారణ యువతిగా కనిపిస్తుందని తెలుస్తోంది. అంటే ధనిక – పేద ల మధ్య అందమైన ప్రేమ కథగా రాధేశ్యామ్ తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ లో ఇదే విషయాన్ని వెల్లడించాడు దర్శకుడు రాధకృష్ణ.
ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ .. కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. రాధేశ్యామ్ మ్యూజిక్ పరంగా అద్భుతంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. కాగా త్వరలో రిలీజ్ అయ్యే టీజర్ లో రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తారని సమాచారం. ఇక ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసందే. అలాగే ఆదిపురుష్ కూడా రీసెంట్ గా షూటింగ్ మొదలైంది.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.