Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణ రాజుగారు ఇతరులకే నీతులా.. తమరి సంగతేంటో మరి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణ రాజుగారు ఇతరులకే నీతులా.. తమరి సంగతేంటో మరి..!

Raghu Rama Krishna Raju : వైసీపీ నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తరచూ ఏపీ ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు చేసే సంగతి అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన లోకసభలో ఏపీ ప్రభుత్వంపై పలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు చేసిన కంప్లయింట్స్ గురించి చర్చించే ముందర, ఆయన చేసిన పనుల సంగతేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఏపీ అప్పుల గురించి మాట్లాడే రాజు గారు తన సంస్థల ద్వారా బ్యాంకులకు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :4 December 2021,6:25 pm

Raghu Rama Krishna Raju : వైసీపీ నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తరచూ ఏపీ ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు చేసే సంగతి అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన లోకసభలో ఏపీ ప్రభుత్వంపై పలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు చేసిన కంప్లయింట్స్ గురించి చర్చించే ముందర, ఆయన చేసిన పనుల సంగతేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఏపీ అప్పుల గురించి మాట్లాడే రాజు గారు తన సంస్థల ద్వారా బ్యాంకులకు ఎగ్గొట్టిన అప్పుల గురించి మాట్లాడాలని పలువురు అడుగుతున్నారు.

ఎఫ్ఆర్ఎంబీ పరిధికి మించి ఏపీ సర్కారు అప్పులు చేస్తోందని, రాష్ట్రం దివాళా తీయబోతున్నదని రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయాలను ప్రస్తావించి ప్రధాని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా‌కు లేఖలు కూడా ఇస్తున్నారు. మీడియా సమావేశాల్లోనూ ఈ విషయాల గురించి వివరిస్తున్నారు. ఏపీ రాష్ట్రసర్కారు చేసే నిర్వాకం వల్ల ఏపీ ప్రజలు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాగా, ఆయనకు చెందిన కంపెనీలు దాదాపు రూ.700 కోట్లు రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలున్నాయి. ఈ విషయమై సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. బీజేపీ ఎంపీ సుజనాచౌదరి కంపెనీపైన కూడా ఇటువంటి ఆరోపణలున్నాయి.

Raghu rama krishna raju complaints on ap govt to central govt


Raghu rama krishna raju complaints on ap govt to central govt

Raghu Rama Krishna Raju : ఆయాసం ఎంత వరకో మరి..

రఘురామకృష్ణరాజు ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందర తన సంస్థలు తిరిగి చెల్లించాల్సిన డబ్బుల గురించి ఎందుకు ఆలోచించడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. తొలుత తాను తన సంస్థల ద్వారా చెల్లించాల్సిన డబ్బులను చెల్లించాలని, ఆ తర్వాతనే ఏపీ సర్కారు అప్పుల గురించి మాట్లాడాలని పలువురు అంటున్నారు. నీతులు చెప్పే ముందర ఆచరించి చూపాలని పేర్కొంటున్నారు. నష్టాలు రావడంతో తన సంస్థకు సంబంధించిన అప్పులు చెల్లించలేకపోతున్నానని రఘురామకృష్ణరాజు అనడం సబబు కాదని అంటున్నారు. చూడాలి మరి.. ఏపీ సర్కారుపై రఘురామ ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది