Raghu Rama Krishnam Raju : జగన్ పై దూకుడు పెంచిన రఘురామకృష్ణంరాజు…!
Raghu Rama Krishnam Raju : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు Raghu Rama Krishnam Raju సమావేశమయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. రఘురామ కృష్ణరాజు Raghu Rama Krishnam Raju ఆరోగ్య పరిస్థితిని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య సీబీఐ కోర్టులో ఉన్న వైఎస్ జగన్ బెయిల్ రద్దు కేసు ప్రస్తావన, సీఐడీ కస్టడీలో ఓ ఎంపీ అయిన తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయం చర్చకు వచ్చాయని అంటున్నారు. అసలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి Raghu Rama Krishnam Raju సంగతి అటోఇటో తేల్చేసేందుకే రఘురామ కృష్ణరాజు.. అమిత్ షాను కలిశారని తెలుస్తోంది.
మరోవైపు రఘురామకృష్ణంరాజు Raghu Rama Krishnam Raju తనకు ఏం చెబుతారో తెలిసే.. ఆ సంగతులన్నీ వినేందుకే అమిత్‌షా సైతం అపాయింట్‌మెంట్ ఇచ్చారని చెబుతున్నారు. ఓవైపు సీబీఐ కోర్టులో కేసు.. మరోవైపు పార్లమెంట్‌లో గతానికి భిన్నంగా వైసీపీ ఎంపీల నిరసనలు.. ఇటు, ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలనే పట్టుదలలో వైసీపీ.. అటు, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఏపీ సర్కారును పార్లమెంట్ ముందు దోషిగా నిలబెట్టాలనే కసిలో రఘురామ కృష్ణరాజు.. ఇలాంటి సందర్భంలో హోం మంత్రి అమిత్ షాతో .. రఘురామ కృష్ణరాజు భేటీ కావడంతో పలు విషయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీరిద్దరి భేటీలో సాగిన చర్చపైనే .. అందరూ ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ భేటీ పర్యవసానాలు .. ఎలా ఉండనున్నాయన్నదే వైసీపీలో చర్చోపచర్చలకు దారితీస్తోంది.
ఢిల్లీలో ఏం జరుగుతోంది.. Raghu Rama Krishnam Raju
ఈ టైంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఎంపీ రఘురామ కృష్ణరాజు భేటీ కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఏపీలో జరుగుతున్న పరిణామాలు, సీఎం జగన్‌రెడ్డి Ys Jagan తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, కోర్టుల్లో వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు, ఆలయాలపై దాడులు.. ఇలా అన్నిటినీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ రఘురామ కృష్ణరాజు అని సమాచారం. అయితే సీఎం జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఏదో జరుగుతోందని.. వేగంగా పావులు కదులుతున్నాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
దీనిపై వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీల ధిక్కారస్వరాన్ని సైతం కేంద్రం సీరియస్‌గా తీసుకుందని చెబుతున్నారు. అందుకే, వైసీపీకి ఝలక్ ఇచ్చేందుకే రఘురామ కృష్ణరాజుకు అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఈ నెల 26న సీబీఐ కోర్టులో తీర్పు రానుందని, జరిగిన ఈ భేటీలో కీలక విషయాలే ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది. దీనిపై కేంద్రం ఏవిధంగా స్పందించనుందోనన్న టెన్షన్ వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఏదేమైనా అనర్హత వేటుకు ప్రయత్నిస్తున్న వేళ.. అమిత్ షాAMith Sha తో రఘురామకృష్ణంరాజు Raghu Rama Krishnam Raju భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.